రైతు వ్యతిరేక చట్టాలపై ప్రధాని మోడీ అస్సలు వెనక్కి తగ్గరని అంత భావించారు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ముందుగానే పసిగట్టేశారు. టీఆర్ఎస్ పోరాటం, డిమాండ్ తోనే రైతు వ్యతిరేక చట్టాలను మోడీ రద్దు చేశారని ఆ క్రెడిట్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించిన అనంతరం అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తారని కేసీఆర్ కు ఎలా తెలిసిందని అంత చర్చించుకున్నారు. ఇదే కాదు, పలు విషయాల్లోనూ కేంద్రం తీసుకునే నిర్ణయాలపై టి. సర్కార్ కు ముందస్తు సమాచారం ఉంటోంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికీ తెలియడం లేదు. ఈ సమయంలో వచ్చిన ఫోన్ ట్యాప్ ఉదంతం కలకలం రేపుతోంది.
తెలంగాణ గవర్నర్ కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు. తన ఫోన్ లోకి వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్ నేతలకు ఎలా తెలిసిందని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నేరాలను పరిశోదించేందుకు చట్ట వ్యతిరేకుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు చట్టంలో అవకాశం కల్పించారు కాని, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాప్ చేయడం చట్టవిరుద్దమే. ఈ మధ్య కాలంలో పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాప్ ఉదంతాలు చాలామటుకు జరుగుతూ వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 10వేల ఫోన్లలో విదేశాల నుంచి తీసుకొచ్చిన పెగాసస్ ఉందని, దీని ద్వారా అన్ని విషయాలను మోడీ ముందే తెలుసుకొని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
అయితే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ కూడా ప్రధాని మోడీ ట్యాప్ చేశారని కేటీఆర్ ఆరోపించడం పలు అనుమానాలకు కారణం అవుతోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి – టీఆర్ఎస్ కీలక నేతలతో చాలా సన్నిహితంగా ఉంటారనే కంప్లైంట్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మినహా కిషన్ రెడ్డి పలు కీలక విషయాల్లో టీఆర్ఎస్ కు అండగా నిలుస్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రత్యేకంగా కిషన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారని పేర్కొనటం పలు సందేహలకు తావిస్తోంది.