ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇంకా చెల్లించలేదు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పాత పెండింగ్ బిల్లులు. కొత్త పనులు మొదలు పెట్టాలంటే చేతిలో డబ్బు లేదు. పెరిగిన అప్పులు – తరిగిన ఆదాయం.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.45 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర ఉన్నది కేవలం రూ.2.౦౦ కోట్ల మాతమే. అంటే దాదాపు రూ.45,౦౦౦ లోటు బర్జేట్. ఇదే ప్రభుత్వాన్ని కలవార పెట్టే అంశం.
దీనిని వెంటనే పూరించాలని కెసిఆర్ అటు ఆర్టిక మంత్రి హరిష్ రావుకు, ఇటు ఆర్టిక నిపుణులను లోగడే ఆదేశించారు. అంటే ఆదాయం వచ్చే శాఖలను ఇంకా పిండి లాభాలు గడించాలి. లేదా పన్నులు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. లేదా కొత్త అప్పులు తీసుకుని రావాలి. ఈ మూడింటిలో పనులు మొదలు పెట్టి ఆ లోటు బడ్జెట్ పూరించాలి కొంత గడువు ఇచ్చారు కెసిఆర్.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఆ దిశల పనులు మొదలు పెట్టారు. ఇది సాదారణ రోజులయితే ఇష్టానుసారంగా చేయవచ్చు. ఈ పాటికి పని జరిగిపోయేది. కానీ ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్నాయి. ఆచి తూచి అడుగు వేయాలి. ఆదాయం వచ్చే శాఖలను ఇంకా పిండినా పైసా ఆదాయం రాలేదు. పన్నులు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. కానీ దేనిమీద పన్నులు వేసినా ‘ఇందులో పన్నులు పెంచితే ఓట్లు పడవు. వద్దు’ అనే ఒత్తిడులు వస్తున్నాయి.
కరెంట్ చార్జీలు పెంచితే బిఆర్ఎస్ దీపాలు ఆరిపోతాయి అని ఒత్తిడులు పెరిగాయి. రైతుల మీద భారం పడితే అంతే సంగతులు. బి ఆర్ ఎస్ కొంపలు అంటుకుంటాయి. మంచి నీటి మీద పన్నుల భారం వేస్తే మొదటికే మోసం వచ్చి బిఆర్ఎస్ నిండా మునిగిపోతుంది.
మరి దేనిమీద పన్నులు పెంచాలి? ఓట్లు పడకుండా ఏ విభాం మీద పన్నులు మోపాలి? ఇది వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక అప్పులు ఇచ్చే నాథుడు కంటి చూపు మేరలో లేడు. ఉన్నా ఎన్నికల ముందు అప్పులు ఇవ్వరు. ఏ సంక్షేమ పతకాలను ఆపినా ఓట్లకు గండి పడుతుంది.
ఈ తర్జన భజనల జరుగుతుండగానే 2023 – 2024 బడ్జెట్ రానే వచ్చింది. దానిని ఈ మార్చ్ ౩౦ న ప్రదేశ పెట్టాలి. కానీ ఎన్నికలు త్వరలోనే రావచ్చు అనే భయంతో పోయిన నెలలోనే ప్రవేశ పెట్టారు. అదికూడా ఇలాంటి లోటు బడ్జెట్. కథ మళ్ళి మొదటికి వచ్చింది.
కాబట్టి మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన కీలక సమావేశంలో ఎన్నడూ లేనిది హరీష్ రావు మీద తొలిసారి కెసిఆర్ కన్నెర్ర చేసినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీరందరూ ఏం చేసుతున్నారు? అని నిలదిసినట్లు తెలిసింది.
దానికి జవాబు చెప్పలేని హరీష్ రావు కోపంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. హరీష్ రావు ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్యం, సంక్షేమ శాఖలను అధనంగా తలా మీద పెట్టుకున్నారు. ఆ పని ఒత్తిడివల్ల అర్థిక శాఖా మీద ద్యాస పెట్టలేకపోతున్నారు. పని భారం పెరిగింది. అనుకున్న ఫలితాలు రావడం లేదు. పని ఒత్తిడిని తగ్గించుకోడానికి హరీష రావు రెండు శాఖలను వదులుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అవి ఏ శాఖలు అన్నది ఇంకా తెలియలేదు.