విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందని బీఆర్ఎస్ తెగ ప్రచారం చేసుకుంది. ఇందుకోసం అధికారులు ఆలస్యం లేకుండా సింగరేణికి వెళ్లి ఉన్నాతాధికారులతో మాట్లాడారు. కట్ చేస్తే బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ప్రభుత్వాలకు అర్హత లేదని తేల్చారు. వాస్తవానికి బిడ్డింగ్ లలో ప్రభుత్వాలు పాల్గొనలేవు. అందుకే సింగరేణిని ముందుంచి బిడ్డింగ్ లో పాల్గొంటామని ప్రచారం చేసుకున్నారు. అలా కూడా బిడ్డింగ్ లో పాల్గొనడటం కుదరదని తేలినా.. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది.
స్టీల్ ప్లాంట్ కార్యాలయంలో ఉన్నాతాదికారులతో చర్చించిన అనంతరం బిడ్డింగ్ లో పాల్గొనడానికి నిబంధనలు అంగీకరించవనే లీకును మీడియాకు పాస్ చేశారు. సింగరేణి కూడా ప్రభుత్వ సంస్థే. కానీ స్టీల్ ప్లాంట్ లో బొగ్గుతో చేసే పనులేం ఉండవు. కాబట్టి సింగరేణిని ముందుంచి బిడ్డింగ్ లో పాల్గొనేందుకు కూడా అవకాశం లేదు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలు అటు ప్రభుత్వానికి లేవు.. ఇటు సింగరేణి సంస్థకు కూడా లేవు. ఈ నిబంధనలు సర్కార్ పెద్దలకు తెలియవేమో కాని తెలంగాణలోని ఉన్నాతాదికారులకు మాత్రం తెలియనివి కావు. అయినప్పటికీ హడావిడి చేసి ఏపీలో మైలేజ్ పొందాలని ట్రై చేశారు. ఇప్పుడు కొత్తగా తాము న్యాయ పోరాటం చేస్తామంటూ ప్రచారం ప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలనుకుంది బీఆర్ఎస్. ఇందుకోసం పెద్ద ఎత్తున తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంది. ఏపీలోని కొన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఆశను కూడా రేకెత్తించింది. చివరికి బిడ్డింగ్ లో అసలు విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రచార రాజకీయాలను చూసిన ఏపీ ప్రజలు తాము మోసపోయామని నిట్టూరుస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బిడ్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గోనలేవు అనే చిన్న విషయం కెసిఆర్ కి తెలియదా? తెలుసు. అయినా కావాలనే ఏపి ప్రజల చెవిలో పూలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కొంటుంది అని గొప్ప డ్రామా ఆడారు.
Also Read : ఇప్పుడు కేసీఆర్ మొదటి ప్రాధాన్యత తెలంగాణ కానే కాదు- ఇదిగో రుజువు..!