కోర్టు తీర్పుతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్ళిపోవడంతో కొత్త సీఎస్ గా శాంతి కుమారిని నియమించారు కేసీఆర్. విధేయుడిగానున్న డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయ్యారు. దాంతో ఇంచార్జ్ డీజీపీగా ఏపీ కేడర్ కు చెందిన అంజనీ కుమార్ ను తాత్కాలికంగా నియమించారు. ఆయన నియామకంపై కూడా వివాదం కొనసాగుతోంది. దీంతో మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
వచ్చే ఆరు నెలల తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు. ఎస్పీలే కీలకం. కాబట్టి సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీ చేపట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మెజార్టీ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లలను మార్చాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవి విరమణ పొందక ముందే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. తాత్కాలిక డీజీపీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. విధేయులకే కీలక పోస్టులు కట్టబెట్టనున్నారు.
ఇక..కలెక్టర్లను ఎవర్ని అపాయింట్ చేయాలనేది సోమేశ్ కుమార్ ఉన్నప్పుడే నిర్ణయించారు. మెజార్టీ జిల్లాల్లో కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమించాలని నిర్ణయించారు. ఎయె జిల్లాలకు ఎవరిని కలెక్టర్లుగా నియమించాలనే జాబితా కూడా రెడీ అయింది. ఈ సంక్రాంతి తర్వాత ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనుంది.
సివిల్ సర్వీసెస్ అధికారులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలసమయంలో ఒత్తిళ్ళకు తలొగ్గకుండా పని చేసే అధికారులకు బాధ్యతలు కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం పలువురి పేర్లను పరిశీలించి తుది జాబితాఖరారు చేసే పనిలో పడ్డారు.
Also Read : రంగంలోకి ఆర్ఎస్ఎస్ – కోరి కష్టాలు తెచ్చుకున్న కేసీఆర్..!