మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పెద్ద హైడ్రామా చోటుచేసుకొనుందా..?మునుగోడు నుంచి టీఆర్ఎస్ మకాం మార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పక్కాగా ప్లాన్ చేసిందా..? రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం మునుగోడు బైపోల్ పై లేకుండా చేసేందుకు ఉభయతారకంగా బీజేపీ, టీఆర్ఎస్ లు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాయా..? ఢిల్లీలో తిష్టవేసి కూతురిని కాపాడుకునేందుకు కేసీఆర్ నడిపిన మంత్రాంగం వర్కౌట్ అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణలో మరో రెండు రోజుల్లో పెద్ద హైడ్రామా జరగనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో నెక్ట్స్ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటిసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో కేసీఆర్ తెర వెనక నడిపిన లాబియింగ్ వర్కౌట్ అయింది. అదేంటి..? కవితకు నోటిసులు అందటం ఖాయమంటున్నారు. మళ్ళీ గులాబీ బాస్ నడిపిన మంత్రాంగం సక్సెస్ అయిందంటున్నారని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఇక్కడే ఎవరికీ కనిపించని రాజకీయ కోణం దాగి ఉంది. మద్యం పాలసీలో కూతురిని కాపాడుకునేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సహకారమందిస్తామని ప్రామిస్ చేసిన కేసీఆర్ కు, బీజేపీ హైకమాండ్ పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చింది.
లిక్కర్ స్కాంపై సర్వత్ర చర్చ జరుగుతోన్న వేళ కవితకు ఈడీ నోటిసులు ఇస్తే మునుగోడు నుంచి మీరంతా మకాం మార్చేందుకు మార్గం సుగమం అవ్వడంతోపాటు బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ తో కమలనాథులు చెప్పారట. నోటిసులు రాగానే మీ పార్టీ నేతలంతా హైదరాబాద్ లోని ఈడీ ముందు నిరసనలతో హోరేత్తిస్తే, మునుగోడులో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. అలాగే, కల్వకుంట్ల కుటుంబంపై బీజేపీ యుద్ధం ప్రారంభించిందనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళకుండా బీజేపీ సొంతం చేసుకుంటుందన్నారట. అయితే, నోటిసులు ఇవ్వడం వలన కవిత ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. కేసీఆర్ జీ కవిత ఇమేజ్ కు నష్టం కల్గించే ఎలాంటి చర్యలు మేం తీసుకొం. ఈడీ విచారణ అనంతరం మునుగోడు ఉప ఎన్నిక ముగియగానే లిక్కర్ స్కాంలో కవితకు లిక్కర్ స్కాంలో క్లీన్ చిట్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారట. దాంతో కవితకు ఈడీ నోటిసులు ఇస్తామనే ప్రతిపాదనకు కేసీఆర్ కూడా అంగీకరించినట్లు సమాచారం.
సరిగ్గా కవితకు ఈ వారంలోనే ఈడీ నోటిసులు ఇష్యూ చేయడం వెనక టీఆర్ఎస్ , బీజేపీల వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నది. మరో వారం రోజుల్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. ఈ యాత్ర హైదరాబాద్ గుండా కొనసాగుతుండటంతో జోడో యాత్ర ప్రభావం మునుగోడుపై ఉంటుందని అంచనా వేసిన బీజేపీ, కవితకు ఈ సమయంలోనే నోటిసులు ఇస్తే హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం వలన జోడో యాత్ర ప్రభావాన్ని నిలువరించవచ్చుననేది బీజేపీ, టీఆర్ఎస్ ల వ్యూహం. అందుకే ఈ వారంలో ఏ క్షణమైనా కవితకు ఈడీ నోటిసులు ఇష్యూ చేసే అవకాశం ఉంది.