Kavitha suspended from BRS..?
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించను. అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులను కూడా చూడను. జైలుకు పంపిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఈటలపై విచారణ జరపకుండానే భూకబ్జాకు పాల్పడ్డాడని ఆయన రాత్రికి రాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితను నిందితురాలిగా అధికారులు చేర్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? అనేది చర్చనీయాంశం అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. బెయిల్ కోసం కవిత తరుఫు న్యాయవాదులు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పలు రకాల కారణాలతో బెయిల్ కోరుతున్నా మనీ లాండరింగ్ కేసు కావడంతో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ముంగిట కవిత అరెస్ట్ బీఆర్ఎస్ ను కుంగదీస్తోంది. పార్టీకి చేటు తెచ్చే పరిణామంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా ఉండటం.. అరెస్ట్ కావడంతో కేసీఆర్ కనీసం స్పందించలేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ రోజున పత్రిక ప్రకటన విడుదల చేశారు.
కవితపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమె అరెస్ట్ పార్టీకి చేటు తెచ్చేదిలా ఉందని ఆయన ఫీలింగ్. అందుకే గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి… అవినీతిపరులైతే కుటుంబ సభ్యులని కూడా చూడనని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. కానీ అందుకు కేటీఆర్ , ఆయన భార్య అడ్డుకున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్.