ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ ను నవంబర్ 20కు వాయిదా వేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఈడీ కవితకు ఎలాంటి సమన్లు జారీ చేయడానికి వీల్లేదని ఈడీని ఆదేశించింది. ఇందుకు ఈడీ కూడా అంగీకరించింది. నవంబర్ 20న తదుపరి విచారణ చేపడుతామని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం తెలిపింది.
వచ్చే నెల 18న పీఏంఎల్ఎ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు.ఆ విచారణ పూర్తైన తరువాతే తదుపరి విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటివరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20వరకు కవితకు విచారించబోమని ఈడీ తరుఫు న్యాయవాది రాజు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ క్రమంలో కవితకు నోటిసులు ఇవ్వకూడదని ఈ నెల 15న సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చంది. అవే ఉత్తర్వులు నవంబర్ 20వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read : తొందర్లోనే కవిత అరెస్ట్ – ఆ తరువాత పెద్దాయనే టార్గెట్..?