దీనియమ్మ రాజకీయం! దేనిని వదలదు. చివరికి తమ, పర భేదాలు కూడా చూడదు. అందరిని తొక్కుకుంటూ ముందుకు సాగిపోవడమే. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటివరకు చాలా ట్విస్ట్ లు వచ్చాయి. ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ అధికారులు త్వరలోనే ఆమె భర్తను కూడా విచారించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ నిందితుడు సమీర్ మహేంద్రు గతంలో కవిత నివాసంలో ఆమెతో సమావేశమయ్యారు. అందులో కవిత భర్త అనిల్ , శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్ రావులు పాల్గొన్నారు. ఆ రోజున ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది..? తెలుసుకోవాలని ఈడీ భావిస్తోంది. ఈ వివరాలను రాబట్టేందుకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు అనిల్ కు కూడా నోటిసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నిజం చెప్పాలంటే అయన నోట్లో వేలుపెడితే కోరకలేని అమాయకుడు. అయన తలుచుకుంటే కెసిఆర్ అండదండతో ఎమ్మెల్యే, ఎంపీగా మారగలడు. మంత్రిగా మరే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. కనీసం ఏదో ఒక సంస్థకు చైర్మన్ గా మారే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఆయనకు వీళ్ళ కుళ్ళు రాజకీయాలంటే మొదటినుంచి ఇష్టం లేదు.
కనీసం ఎమ్మెల్యేగా చేరమని కేటిఆర్ లోగడ కోరినా ‘వద్దులే. ఇప్పటికే బిఆర్ఎస్ కుటుంబ పాలనతో నిండిపోయింది’ అని చాలా సున్నితంగా తప్పించుకున్న సౌమ్య శీలి. కవిత ఏం చేసినా పట్టించుకోడు. ఆమె పాల్గొనే కార్యక్రమాలలో అస్సలు పాల్గొనడు . అసలు ఆమెతో కలిసి తిరిగిన దాఖలాలు కూడా లేవు. ప్రెస్ కు ఆమడ దూరంలో ఉంటాడు.
ఎక్కడికి వెళ్ళినా అతను కెసిఆర్ అల్లుడని పోజులు కొట్టడు. అతని ప్రపంచం వేరు. ఓ సాదువులాంటి వాడు. పాపం! అలాంటి భర్తను కవిత డిల్లి లిక్కర్ స్కాం లో ఇలా అడ్డంగా ఇరికించడం ఎంతవరకు న్యాయమో ఆమె విచక్షణకే వదిలేయాలి.