నిన్న, అంటే సోమవారం ఉదయం 10:30 నుంచి రాత్రి 9:10 నిముషాలవరకు ఎమ్మెల్సి కవితను ఈడి అధికారులు దాదాపు పది గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఆ విచారణంలో ప్రధాన నిందితుడు రామచంద్రన్ పిళ్ళై చేతులు ఎత్తేశాడు. తానూ రూ. 100 కోట్ల స్కాం చేసినట్లు దాదాపు ఒప్పుకున్నాడు. అయితే అతను కవితకు కేవలం బినామిని అని చేతులు ఎత్తేశాడు. దానితో కవిత గొప్ప ఇరకాటంలో పడ్డారు.
నిన్న కవిత, పిళ్ళై ని ఒకేసారి విచారించినప్పుడు కూడా అతను అదే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. అయితే అతను లోగడ మాట్లాడిన మాటల డేటా మొత్తం సెల్ల్ ఫోన్ లలో ఉన్నాయి. కానీ వాటిని పగలగొట్టారు. వాటిలోని డేటాను వెలికి తీసే పనిలో ఈడి ప్రత్యేక నిపుణులను కేటాయించింది. ఆ ఆధారాలు ఇప్పుడు కీలకం కానున్నాయి. అవి నిన్న సకాలంలో ఈడి కి అందలేదు. బహుశా ఈరోజు అందితే ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ కొత్త మలుపు తిరుగుతుంది.
అందుకే ఈడి ఈరోజు, అంటే మంగళవారం ఉదయం 11:30 మరోసారి విచారణకు రావాలని కవితను ఆదేశించింది. ఈరోజు విచారణలో ఈ కేసులో కవిత కూడా నిందితురాలు అని నిర్ధారణ కావచ్చు. అదేగనక జరిగితే ఆమెను ఖచ్చింతంగా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు.
కాబట్టి ఏదో ఒక కుంటిసాకు చూపి ఈ రోజు 11:౩౦ లకు ఈడి విచారణకు డుమ్మా కొట్టి, ఈ నెల 24 సుప్రీం కోర్ట్ లో ఆమె వేసిన కేసులో డైరెక్టర్ గా పాల్గోవాలని కవిత ఎత్తు వేస్తున్నట్లు పుకార్లు పుడుతున్నాయి. ఏ వంకతో తప్పించుకోవాలో తలలు పండిన లాయర్లతో ఆమె మంతనాలు జరుపుతోంది. ఏ వంక దొరకకపోతే, ఆరోగ్యం బాగోలేదని తప్పించుకునే వంక ఆమెకు ఎలాగో ఉండనే ఉన్నది.
ఒకవేళ కవిత ఏ వంకతో డుమ్మా కొట్టాలని చూసినా ఆమెను జరెస్ట్ చేసి విచారించే అవకాశం ఈడీకి ఉంది. ఎందుకంటే ఈడి ఆల్రెడీ కోర్ట్ నుంచి ‘కేవియట్’ కేసు పెట్టి ఈ అనుమతి తీసుకుంది. అందుకే ఆమెకు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా ఆమె ఎత్తుకు పైఎత్తు వేసే అవకాశం ఉంది. కాబట్టి విచారణకు ఆమెను హాజరు కావడం మంచిదని ఆమె తరపు లయర్లుకుడా హితవు చెప్పవచ్చు. ఈ రోజు 11:30 లకు ఏం జరుగుతుందో నని అందరు ఆసక్తిగా ఎదురు చూసుత్న్నారు.