ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల తన కాలికి గాయమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ నుంచి పిలుపు రాబోతుందనే విషయం గ్రహించే కవిత తన కాలుకు గాయమైనట్లు పెర్కొన్నారా..? అని సందేహాలను వ్యక్తం చేశారు.అయితే, ఆమె తన కాలు ఫ్రాక్చర్ అయిందని పోస్ట్ చేసి 24గంటలు గడవకముందే ఆప్ నేతల వ్యవహారాలను గతంలో చక్కదిద్దిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ కవితపై బిగ్ బాంబ్ పేల్చాడు. ఆమెతో చేసిన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ లను బయటపెట్టాడు. దాంతో కవిత కాలి గాయంపై విపక్ష నేతల సందేహాలు నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కవితతో సుఖేష్ చంద్రశేఖర్ కోడ్ లాంగ్వేజ్ తో చాట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆప్ నేతలతో కవితకు ఎలాంటి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.? ఆమెకు ఎందుకు ఆప్ నేతలు రూ. 15కోట్లు ఇవ్వమన్నారు..? ప్రశ్నలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. ఇదంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ద్వారా ప్రయోజనం పొందినందుకే ఆప్ నేతలు ఆమెకు 15కోట్ల ముడుపులు ఇచ్చి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కీలక దశకు చేరుకుంటుందని ప్రచారం జరుగుతోన్న వేళ ఈ చాటింగ్ వివరాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది.
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్ లీక్ కు ఓ రోజు ముందు కవిత కాలికి గాయం బిగ్ డిబేట్ గా మారింది. ఆ గాయం సుఖేష్ చేసిందేనా అన్న చర్చ ఊపందుకుంది. ఎందుకంటే కవిత తనకు ఏం జరిగినా సోషల్ మీడియాలో అసలే షేర్ చేయరు. ఎవరితోనూ పంచుకునేందుకు ఆమె ఇష్టపడరు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఏం ఉండరు కవిత. కానీ ఈసారి మాత్రం గతానికి భిన్నంగా తన కాలికి గాయమైందని ట్వీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సుఖేష్ బయటపెట్టిన వాట్సప్ స్క్రీన్ షాట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆప్ నేతల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆఫీసులో 15కోట్లు ఇచ్చానని గతంలో చెప్పిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా ఆ ఆరోపణలకు తాలూకు ఆధారాలను బయటపెట్టడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
Also Read : లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం- వాట్సప్ చాట్ తో దొరికిపోయిన కవిత