ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను వరుసగా విచారిస్తున్నాయి. నిప్పు లేకుండా పొగ రాదనేది అందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్ లో కవితకు ఎలాంటి ప్రమేయం లేకపోతే ఆమెను ఈకేసులో ఇలా రోజుల తరబడి విచారించే అవకాశం లేదు. కవిత ప్రమేయం ఉందని సమాచారం ఉండటంతోనే కవితను ఈడీ విచారణకు పిలుస్తోంది.
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులో కవితను ఇరికించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.బీఆర్ఎస్ పై కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగితే కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులలో ఎవరో ఒకరిని విచారణ పేరుతో వేధించేవారు. కానీ కవితను విచారిస్తున్నారు. ఈ స్కామ్ వలన కవితకు ముడుపులు అందినట్టు ఆధారాలు ఉండటంతోనే ఈడీ కవితను విచారిస్తోంది. వీటన్నింటిని వదిలేసి గులాబీ మీడియా మాత్రం కవితను రాణి రుద్రమ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తోంది.
సోమవారం జరిగిన ఈడీ విచారణలో దర్యాప్తు సంస్థ అధికారులకు కవిత చుక్కలు చూపించిందని బీఆర్ఎస్ అనుకూల మీడియా ప్రసారం చేసింది. పేపర్ లోనూ ఇదే వార్తలకు ప్రాధాన్యత ఇచ్చింది. కవితను దర్యాప్తు సంస్థ అధికారులు విచారించాలేదట. కవితే ఈడీ అధికారులను ప్రశ్నించిందని రాసుకొచ్చారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ఈడీ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక నీళ్ళు నమిలారని పేర్కొన్నారు. ఈడీ అధికారులపై కవిత పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిందని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు.
అంతేకాదుఈడీ అధికారులను కవిత ఎలాంటి ప్రశ్నలు అడిగిందో కూడా రాసుకొచ్చారు కొత్త చర్చకు తెరలేపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను నిందితురాలుగా విచారిస్తున్నారా? లేక అనుమానితురాలిగానా? ఈ విషయాల మీద క్లారిటీ ఇవ్వండి. ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా తన మద్యం పాలసీని మార్చుకుంటే దాంతో నాకేంటి సంబంధం? రాజకీయ దురుద్దేశ్యంతో ఇలా ఎంతమందిని విచారణకు పిలుస్తారు. హిమంత బిశ్వ శర్మ, నారాయణ రాణే, సుజనా చౌదరి పై గతంలో మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయి? బిజెపిలో వారంతా చేరగానే ఎందుకు విచారణ ఆగింది” అని ఇలాంటి ప్రశ్నలతో దర్యాప్తు సంస్థ అధికారులను కవిత ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిందని బీఆర్ఎస్ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేసి పరువు తీసుకుంటుంది.
విచారణ పేరుతో పిలిచి గంటలతరబడి ఓ గదిలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడి చస్తే లొంగిపోతామనుకుంటున్నా రా..? రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెలంగాణ బిడ్డ లొంగదని చెప్పినట్లు పింక్ మీడియా కవితను రాణి రుద్రమ రేంజ్ లో హైలెట్ చేసి చూపించి స్వయం సంతృప్తి పొందింది. కానీ జనాల్లో పలుచన అవుతున్నట్లు గుర్తించలేకపోతుంది.
Also Read : కీలకంగా మారిన కవిత ఫోన్..నేడే అరెస్ట్ చేసే అవకాశం..?