ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పరిణామాలు వేగంగా మారుతుండటంతో కవిత తన పంథా మార్చుకున్నారు. కేంద్రంలోని భాజాపా సర్కార్ ను వదిలేసి కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ ను అవుట్ డేటెడ్ నాయకుడని.. మోడీ ప్రభంజనం ముందు రాహుల్ ఏమాత్రం నిలబడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ బలహీనమైన నాయకత్వం వలెనే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం అయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల పార్టీ మీటింగ్‌లో కవిత తన ప్రసంగం ఆసాంతం కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు. రాహుల్ ను విమర్శిస్తూ మోడీని పరోక్షంగా గ్రేట్ లీడర్ అనేలా వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన కవిత హటాత్తుగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ మోడీని ప్రశంసించడం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పరిణామలు మారుతుండటంతో కవిత ట్యూన్ లో చేంజ్ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రామచంద్ర పిళ్ళై కవిత తరుఫున బినామీగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారి ఆయన ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. తాను కవిత బినామీనని మొదట అంగీకరించి తరువాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటా అన్నారు. మళ్ళీ తాజాగా అప్రూవర్ గా మారారు పిళ్ళై. ఇప్పటికే ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అప్రూవర్లు అయ్యారు.
తాజాగా కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ ను అటకేక్కించారని ఆరోపణలు వస్తుండగా..ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ కారణంగానే కవిత బీజేపీని వదిలేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : ఎన్నికలు ఇప్పట్లో లేవు – తెలంగాణలో రాష్ట్రపతి పాలన..?