ఈ రోజు ఉద్యయం 11 గంటలకు ఈడి కార్యాలయానికి హాజరు కావలసిన ఎమ్మెల్సి కవిత 10 :౩౦ హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్ళై కస్టడి ఈ రోజు మధ్యాహాన్నం ౩ గంటలకు ముగియనుంది. లోగడ ఈడి ఆయనను విచారించి నప్పుడు రూ 100 కోట్ల స్కాం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే తాను కవితకు బినామిని అని చేతులు ఎత్తేశాడు. దానితో ఆ కేసు బంతి కవిత కోర్ట్ లో పడింది.
అందుకే కవితను, పిళ్ళై ని ఎదురెదురుగా కూర్చోపెట్టి ఏకకాలంలో విచారించాలని ఈడి నిర్ణయించింది. సమయం తక్కువగా ఉన్నందువల్ల ఓ అర్థ గంట ముందుగా విచారణకు రావాలని ఈడి కవితను ఆదేశించినట్లు తెలిసింది. ఎందుకంటే ఈడి ఆల్రెడీ కోర్ట్ నుంచి ‘కేవియట్’ కేసు పెట్టి ఈ అనుమతి తీసుకుంది. అందుకే ఆమెకు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా అర్థ గంట ముందే విచారణకు హాజరయ్యారు. ఆమెను హాజరు కావడం మంచిదని ఆమె తరపు లయర్లు కూడా హితవు చెప్పినట్లు తెలిసింది.
అయితే కవిత ఈ నెల 11 తేదీన ఈడి కార్యాలయానికి వచ్చిన హడావుడి ఈ రోజు కనిపించలేదు. జనం చాలా తక్కువ సంఖ్య లో వచ్చారు. ఆమె వెంట కేటిఆర్, ఆమె భర్త, ఇద్దరు మంత్రులు మాత్రమే ఉన్నారు. మునుపటి హడావుడి లేదు.
ఈ రోజు ౩ గంటలకు ఏం జరగబోతోంది?
ఈ రోజు ౩ లోపు పిళ్ళై చేసిన ఆరోపణ అబద్దమని తేలితే కవిత మీద ఉన్న ‘అనుమానితులురాలు’ పేరును ఈడి కొట్టేస్తుంది. ‘ఆప్’ పార్టీకి కి అందిన రూ. 100 కోట్లతో కవితకు ఎలాంటి ప్రమెయం లేదని క్లీన్ చీట్ ఇచ్చి ఇంటికి పంపుతుంది.
ఒకవేళ పిళ్ళై చేసిన ఆరోపణ నిజమని తేలితే కవితను ‘నిందితురాలు’గా కేసు నమోదు చేస్తారు. ఆమెను అరెస్ట్ చేసి నేరుగా జైలుకు పంపుతుంది ఈడి. అందరిని ఇలా స్మూత్ గా విచారణకు పిలిచిన ఈడి నేరుగా జైలుకే పంపింది. కాబట్టి ఈ రోజు ఎం జరుగుతుందో చూడాలి.