ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరింత ఇరకాటంలో పడిపోయారు. మున్ముందు జరగబోయే పరిణామాలను అంచనా వేయకుండానే ఈడీ విచారణకు డుమ్మా కొట్టేసి కవిత వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఈడీ విచారణ కోసమే ఢిల్లీ వెళ్తున్నట్లు కవిత ప్రకటించారు. కానీ గురువారం నాటి విచారణకు చివరి క్షణంలో హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. విచారణకు హాజరయితే అరెస్ట్ చేస్తారని భయపడ్డారో ఇతరత్రా కారణాల తెలియదు కానీ ఈడీ విచారణకు హాజరు కాకుండా కవిత హైదరాబాద్ వచ్చేశారు. ఆమెకు మద్దతుగా ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ , హరీష్ రావులు కూడా హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. నేటి విచారణకు డుమ్మా కొట్టి మరో విధంగా కూడా కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీకి మరో మార్గంలో కూడా అవకాశం కల్పించారు.
నేటి విచారణకు కవిత డుమ్మా కొట్టడంతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటిసులు జారీ చేసింది. వాస్తవానికి కవిత ఈవాల్టి విచారణకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణంగా అనారోగ్య సమస్యలతోపాటు సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు వస్తుందని అందుకే నేటి విచారణకు రాలేనని ఈడీకి సమాచారం అందించింది. కవిత తెలివిని పసిగట్టిన ఈడీ ఆమెను ఈ నెల 20నే విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు ఇవ్వడం వ్యూహాత్మకమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రెండోసారి కూడా కవిత ఈడీ నోటీసులకు స్పందించకుంటే వెంటనే ఈడీ వారెంట్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆమె అంచనా వేయకుండా హైదరబాద్ నుంచి గైడెన్స్ తీసుకొని చివరి క్షణంలో విచారణకు డుమ్మా కొట్టి తప్పు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈవాల్టి విచారణ గురించి మాత్రమే ఆలోచించి తప్పు చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ నేటి విచారణకు కవిత హాజరై అరెస్ట్ అయితే విషయం వేరేలా ఉండేది. విచారణకు సహకరించడం లేదని కవితను అరెస్ట్ చేస్తే అది కవితకు రాజకీయ భవిష్యత్ కే మచ్చగా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సరిగా అంచనా వేయలేకపోయింది. ఈడీ అధికారాలపై స్పష్టమైన అవగాహనా ఉన్నప్పటికీ విచారణకు డుమ్మా కొట్టి దర్యాప్తు సంస్థకు కవిత మరింత అడ్వాంటేజ్ ఇచ్చారని అంటున్నారు.
Also Read : బిగ్ బ్రేకింగ్ : లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ – సంకేతాలు ఇచ్చిన ఈడీ