ఢిల్లీ లిక్కర్ స్కాం భయటపడగానే ఎమ్మెల్సి కవిత తన పది సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది అని ఈడి లోగడ ప్రధానంగా ఆరోపించింది. ఈడి తో రెండుసార్లు జరిగిన విచారణలో కూడా ఈ ప్రశ్నలే పదే పదే ఆమెను అడిగింది. అయితే వాటిని ధ్వంసం చేయలేదని ఆమె నిన్న రాత్రి జరిగిన విచారంలో చెప్పినట్లు తెలిసింది.
ఈ సెల్ ఫోన్లలో x x x 99 99 999 చాలా కీలకమైనది. దీని ఐ ఎం ఈ ఐ నెంబర్ 352493645127612. ఇది మార్చిన తేదీ 09-08-2022. దీని డేటా గనక దొరికితే చాలా నిజాలు వెలుగులోకి వస్తాయి అని ఈడి అధికారులు భావిస్తున్నారు. అసలు ఒక సి ఎం కూడా వాడని విధంగా ఒక ఎమ్మెల్సి పది ఫోన్లు ఎందుకు వాడాల్సి వచ్చిదో నని ఈడి ని ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్న.
అందుకే ఆమె ఈ రోజు తన దగ్గర ఉన్న ఆ పది సెల్ ఫోన్ లను ఈడి కి సమర్పించాలని నిర్ణయించింది. అందుకే ఆమె ఈడి కార్యాలయంలోకి వెళ్లేముందు ఉదయం అందరికి చూపారు.
దానితో ఈ కేసు ఒక్కసారిగా రాజకీయం రంగు పులుముకుంది. ఆ పది దమ్మి సెల్ ఫోన్ లు ఇంతకుముందు వాడిన ఫోన్లు కావని, ఈ మధ్య వాడినవి అని బిజెపి ఒక్కసారిగా బగ్గుమంది. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని కొత్త ఫిట్టింగ్ పెట్టింది.
దీని మీద బిఆర్ఎస్ మంత్రులు కూడా అదే స్టాయిలో బగ్గుమన్నారు. అంతటి దౌభాగ్యం తమకు లేదని మండిపడుతున్నారు. ఒకవేళ ఈడి వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపితే, వాటి రిపోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. కేసు మరింత జాప్యం జరగొచ్చు. ఈ లోగ కవిత సుప్రీం కోర్ట్ లో వేసిన కేసు కూడా కొత్త మలుపులు తిరగొచ్చు. కవిత, కేసీఆర్ కూడా కోరుకునేది కూడా ఇలాంటి జాప్ఇయమే. చూడాలి ఏం జరుగుతుందో.