బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తలతో మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు. సోమవారం సాయంత్రం కసిరెడ్డిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని మంతనాలు కొనసాగించారు.
కసిరెడ్డి అన్నా.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..కల్వకుర్తి టికెట్ గురించి నేను నాన్నతో మాట్లాడుతా.. రెండు , మూడు రోజులు ఓపిక పట్టు అంటూ కసిరెడ్డి కన్విన్స్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నించినట్లు సమాచారం. గతంలోనూ టికెట్ పై హామీ వెనక్కి తగ్గారని.. తనకు పార్టీ మార్పుపై కార్యకర్తల నుంచి ఒత్తిళ్ళు అధికం అవుతున్నాయని కసిరెడ్డి మంత్రి కేటీఆర్ కు వివరించారు. టికెట్ పై నేను నాన్నతో మాట్లాడుతానని కేటీఆర్ అన్నారంటే.. జైపాల్ యాదవ్ కు టికెట్ నిరాకరించి కసిరెడ్డికి టికెట్ ఇస్తారా..? అనే చర్చ ప్రారంభమైంది. జైపాల్ యాదవ్ స్థానంలో అభ్యర్థిగా కసిరెడ్డిని ప్రకటిస్తే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ రచ్చ కొనసాగే అవకాశం ఉంది. దీంతో కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతుందనేది ఉత్కంట రేకెత్తిస్తోంది.
కసిరెడ్డిని కేటీఆర్ బుజ్జగించేందుకు ప్రయత్నించిన ఫలితం లేదని సమాచారం. పార్టీ మరెందుకే ఆయన ఇంట్రెస్ట్ గా చూపుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కల్వకుర్తి టికెట్ పై కాంగ్రెస్ నుంచి హామీ లభించింది. బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందనే నమ్మకం ఆయనకు లేదు. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ ను వీడెందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కసిరెడ్డి 2016లో బీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ అవకాశం దక్కలేదు. 2018లోనూ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2023లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆయన గ్రౌండ్ లెవల్ నుంచి క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈసారి కూడా కసిరెడ్డికి నిరాశే ఎదురైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు టికెట్ కేటాయించారు కేసీఆర్. జైపాల్ యాదవ్ , కసిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో జైపాల్ యాదవ్ ను ఓడించాలని కసిరెడ్డి కసికసిగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ లో టికెట్ పై హామీ ఇస్తే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నానని సమాచారం ఇవ్వడంతో..వంశీచంద్ రెడ్డితో చర్చించి రేవంత్ కసిరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేలా తెరవెనక మంత్రాంగం నడిపారు. కార్యకర్తలతో సమావేశమై కసిరెడ్డి నేడో, రేపో పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : కల్వకుర్తిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కసిరెడ్డి..!!