విలక్షణ నటుడు కమల్ హసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికావడంతో ఆయన్ను ఉదయం చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసిన అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో కమల్ హసన్ డిశ్చార్జ్ అయ్యారు.
బుధవారం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. కళా తపస్వి విశ్వనాథ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాయంత్రానికి చెన్నై వెళ్ళిపోయారు. అప్పటివరకు బాగానే ఉన్నా కమల్ హసన్ కు జ్వరం రావడంతోపాటు గురువారం ఉదయం శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
విక్రం సినిమా ద్వారా హిట్ కొట్టేసిన కమల్ హసన్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.