నటి కల్పిక గుర్తుండే ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టుతో గుర్తింపు పొందిన కల్పిక ఆ తరువాత చాలా సినిమాలోనే నటించింది. ఇటీవల విడుదలైన యశోదా సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది కూడా.పదుల సంఖ్యలో సినిమాలో నటించినప్పటికీ, హీరోయిన్స్ కంటే అందంగా ఉంటాననే అక్కసుతో తనను పక్కన పెట్టేశారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను 30 సినిమాలో నటిస్తే అందులో విడుదలైనవి సగం మాత్రమేనని చెప్పింది. అలాగే పలు విషయాలను నిర్మొహమాటంగా పంచుకుంది.
అందరిలోనూ కామం ఉంటుంది. అమ్మాయిలు అందుకు మినహాయింపేమి కాదు. కాకపోతే దానిని ఎక్కడ ప్రదర్శించాలి అనేది ముఖ్యం. అబ్బాయిలు లిమిట్ క్రాస్ చేయకుండా వ్యవహరించాలి. మాట్లాడాలి. అమ్మాయి సెక్సీగా ఉంటుంది… హాట్ గా ఉంటుందనే కామెంట్స్ ఒకే. అంతవరకు ఉంటె సమస్య లేదు కాని, పరిధి దాటితేనే అసలు సమస్య అని చెప్పుకొచ్చింది కల్పిక. మనం పొరుగు అమ్మాయిల విషయంలో ఏమైనా చేయాలనుకుంటే ఆ స్థానంలో మీ ఇంట్లో వాళ్ళను ఊహించుకొండి. మీ అమ్మనో, చెల్లినో అయితే ఇలాగె మాట్లాడుతారా..? అందుకే మనమేం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని మాట్లాడాలని సూచించింది కల్పిక.
మిమ్మల్ని ఎలా పెంచుతున్నారనేది ముఖ్యం. ఇంట్లో వాతావరణం మీకు తెలియకపోయినా సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అందులో మంచిని తీసుకోవాలి. చెడును వదిలేయాలనేది పాయింట్. అందరిలో తల్లిని చూడమని చెప్పడంలేదు. ఎందుకంటే తల్లిని కూడా కామంతో చూసే కీచకులు కూడా ఉన్నారు. దేనిపై నేను పోరాడటం లేదు. మార్పుకు శ్రీకారం చుట్టాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మార్పు అనేది మొదట మన నుంచే ప్రారంభం కావాలని అనుకుంట. అందుకే మనల్ని మనం పరివర్తనం చేసుకుంటూ మన చుట్టూ పక్కల వారిని మార్చాలంటూ చెప్పుకొచ్చింది.