జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపును ఆపేందుకు బీఆర్ఎస్ నానా విధాలుగా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ సీటులో తిరిగి గెలిచేందుకు తంటాలు పడుతున్నప్పటికీ …అది సాద్యం కాదని వారికి అర్ధమయింది. కాబట్టి ఏదో రకంగా కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను వర్గాలుగా విభజించే కుట్రలకు తెరతీసింది. వాస్తవానికి జూబ్లీహిల్స్‌లోని ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఎంఐఎం కూడా నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వానికి మద్దతు పలికింది. దీంతోపాటూ జూబ్లీహిల్స్‌లో స్థానికుడైన నవీన్ యాదవ్‌కు సమస్యలపై అవగాహన, కొట్లాడేతత్వం ఉందని ప్రజలందరి నోటా వినిపిస్తున్న మాట. వీటన్నింటికీ తోడు ప్రజా సర్కార్ చేస్తున్న సంక్షేమ పాలనపై ప్రజల్లో ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ కూడా నవీన్ యాదవ్ గెలుపునకు కారణంగా మారుతుంది.
ఈ క్రమంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఏళ్లుగా ముస్లింలకు తీరని సమస్యగా ఉన్న స్మశాన వాటిక అంశాన్ని తెరమీదకు తెచ్చింది. కానీ ఈ డిమాండ్‌పై ఉప ఎన్నిక రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థలం కోసం స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి వివరాలు సేకరించారు. కానీ పదేళ్ల పాటూ అధికారంలో ఉండి కూడా ముస్లింలకు స్మశాన వాటిక స్ధలం కేటాయించలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎన్నికల కోసం మరోసారి ఆ అంశాన్ని తెరమీదకు తెచ్చి అభాసుపాలవుతున్నది. రెండు సార్లు ఇదే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉండి కూడా సమస్య పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నిస్తున్నారు ముస్లీంలు.
కేటీఆర్ ఇప్పుడొచ్చి హామీల మీద హామీలు ఇస్తున్నారు కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌లో సమస్యల పరిష్కారానికి ఎందుకు పనిచేయలేని సూటిగా నిలదీస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పనులు అవుతాయని, అందులోనూ నవీన్ యాదవ్ లాంటి చురుకైన యువకుడితోనే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని ధృడంగా నమ్ముతున్నారు.