జూబ్లీహిల్స్ పల్స్ పట్టడంలో అన్ని సర్వే సంస్థలు ఒక ఎత్తు అయితే…పాలిట్రిక్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ చాలా విభిన్నం. పోలింగ్ కు మరో రెండు మూడు రోజులుండగా పలు సంస్థలు తమ సర్వేలను విడుదల చేశాయి. అందులో కేకే సర్వే స్ట్రాటజీస్, చాణక్య స్ట్రాటజీస్ వంటి సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. కానీ గ్రౌండ్ రియాల్టీకి దూరంగా ఈ సంస్థలు ఇచ్చిన సర్వేలకు..పాలిట్రిక్స్ విడుదల చేసిన సర్వేకు చాలా తేడా ఉంది. ప్రజల నాడిని గుర్తించడంలో అపార అనుభవం ఉన్న పాలిట్రిక్స్ సంస్థ ముందు నుంచి కాంగ్రెస్ గెలుపు తథ్యమని చెప్తోంది. అయితే ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య కాస్త తేడా మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ దే గెలుపు అంటూ పోలింగ్ ముందు ప్రచారం చేసుకున్నాయి. కానీ ఎన్నికల తర్వాత ఆ సంస్థలన్నీ మూగబోయాయి.
PolyTricks జూబ్లీహిల్స్‌లో ఎగ్జిట్ పోల్ సర్వే
Jubilee Hills By-election Exit Poll Survey. #JubileeHillsByElection #TelanganaPolitics pic.twitter.com/5XqmXcaePJ— PolyTricks (@PolyTricks_in) November 11, 2025
అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు కాస్త తేడాతో అంచనా వేసిన పాలిట్రిక్స్ సంస్థ..పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశముందని అప్పుడే చెప్పింది. పోల్ మేనేజ్ మెంట్ తో పాటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గతిని మార్చతుందని ముందుగానే అంచనా వేసింది. పోలింగ్ రోజున ఆ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దీంతో ముందుగా బీఆర్ఎస్ కు లీడ్ ఇచ్చిన సంస్థలు…ఎగ్జిట్ పోల్స్ నాటికి సైలెంట్ అయిపోయాయి. మరికొన్ని ప్లేటు ఫిరాయించాయి. కానీ పాలిట్రిక్స్ మాత్రం ప్రతినిత్యం ప్రజల నాడిని గమనిస్తూ ఉన్నది ఉన్నట్లు చెప్తూ వచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య 13 శాతం ఓట్ల తేడా ఉంటుందని సెఫాలజిస్ట్ జయాల ప్రశాంత్ చెప్పారు.
మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అవడంతో మొదటి నుంచి జూబ్లీహిల్స్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది పాలిట్రిక్స్ సంస్థ. అభ్యర్ధులను ప్రకటించక ముందు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది.. అభ్యర్ధుల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా మారింది అని పాలిట్రిక్స్ సర్వే నిర్వహించింది. అంతేకాదు ప్రచారంలో ఎలాంటి అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి. ఏయే అంశాల ఆధారంగా ప్రజలు ఓటు వేసే అవకాశముంది. ఏయే వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి అనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసింది. డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించి ప్రజల నాడిని పూర్తిగా అంచనా వేస్తూ వచ్చింది పాలిట్రిక్స్.
