దొంగలను పోలీసులు పట్టుకుంటే అది చట్టం. మరి పోలీసులే దొంగతనం చేస్తే ఏ చట్టం పట్టుకుంటుంది? విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, అదానీ లాంటి నేరస్తులు బ్యాంక్లో లోన్లు తీసుకుని పంగనామం పెట్టారు. వాళ్లను క్షమించి.. మరి పంగనామాలు పెట్టుకుని రామనామాన్ని నిరంతరం స్మరించే బీజేపీ నేతలే లోన్లు తీసుకుని పంగనామం పెడితే ఎలా? వీళ్లను ఎలా క్షమించాలి ప్రజలు? పూజారి విగ్రహం దొంగిలిస్తే ఏ దేవుడు క్షమిస్తాడు?
బీజేపీ నేతలు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణ రెడ్డి తమకున్న పలుకుబడితో లక్ష్మీ విలాస్ బ్యాంకులో 18 కోట్ల లోను తీసుకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తిరిగి చెల్లించలేదు. కనీసం వడ్డీ కట్టమని బతిమాలినా కట్టమని దబాయించారు. ఈ ఇద్దరి నేతలపై ఒత్తిళ్ళు అధికం కావడంతో వీరిద్దరూ కమిట్ మెంట్ మేరకు బీజేపీలో చేరినట్లు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ లోన్ ఒత్తిళ్ళ నుంచి విముక్తి కల్పిస్తామనీ బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
లోన్ తీసుకొని చాలా కాలమే అయింది. ఇద్దరు లక్ష్మీ విలాస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని దబాయిస్తూ ఉండటంతో రిలయన్స్ సంస్థ అస్తుల వేలానికి నోటీసు ఇచ్చింది. రిలయన్స్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ వేలం వేస్తున్నది. దేశంలో ధర్మాన్ని, చట్టాన్ని నాలుగు పాదాలమీద నడిపిస్తున్నాము అని నీతులు చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు తలను తీసి ఎక్కడ పెట్టుకుంటారు..?