బాబాల అవతారమెత్తి కొంతమంది కీచకులు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టడం కొనసాగుతూనే ఉంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే హర్యానా రాష్ట్రంలో జిలేబి బాబాగా గుర్తింపు పొందిన అమర్ వీర్(63) ఏకంగా 120మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు తేలడం సంచలనంగా మారింది.
తన దగ్గరికి వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ఈ జిలేబి బాబా స్టైల్. అంతేకాదు ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని మహిళలపై పదేపదే అత్యాచారాలు చేయడం ఇతని దినచర్య. ఈ క్రమంలోనే అతని పాపం పండి కోర్టు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
అమర్ వీర్ కు నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహనకు వలస వెళ్ళాడు. 13ఏళ్ల పాటు జిలేబి దుకాణం నడిపాడు. ఆ సమయంలోనే ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. అది అతని జీవితాన్ని సమూలంగా మార్చేసింది.
ఇలా జిలేబి దుకాణం ఎన్నాళ్ళు నడుపుతామని భావించి క్షుద్ర పూజలపై ఆసక్తి చూపాడు. ఆ సమయంలోనే అదృశ్యమయ్యాడు. కొన్నాళ్ళ తరువాత తిరిగొచ్చి ఓ ఆలయం పక్కన ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ నుంచి తనను తాను దైవ దూతగా ప్రచారం చేసుకున్నాడు. ఇతని మాటలు నమ్మి పలువురు అమర్ వీర్ భక్తులు అయ్యారు. వారిలో చాలామంది మహిళలే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన జిలేబీ బాబాగా స్థిరపడిపోయాడు.
2018లో అమర్ పై మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు పరిచయస్తుడైన భార్యపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విచారణలో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోర్టులో అతడి నేరాలు నిరూపితమయ్యాయి. దీంతో ఆయనకు 14 యేళ్ల కోర్టు జైలుశిక్ష విధించింది.
Also Read : ప్రియుడి మోజులో పడి భర్తను భార్య ఏం చేసిందంటే..?