సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (Jd LaxmiNarayana ) బీఆర్ఎస్ ( BRS ) లో చేరనున్నారా..? ఇందుకు ముహూర్తం ఖరారు అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
లక్ష్మినారాయణ(Jd LaxmiNarayana ) చూపు బీఆర్ఎస్( BRS) వైపు మల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఆయన చేస్తోన్న ట్వీట్లు బీఆర్ఎస్ గురించే ఎక్కువగా ఉంటున్నాయి. స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant ) లో బీఆర్ఎస్( BRS) క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాన కారణం జేడీ లక్ష్మినారాయణే. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ ను ఆయనే డిమాండ్ చేశారు. ఆ తరువాత బీఆర్ఎస్( BRS) బిడ్ వేస్తామని చెప్పగానే ఆ పార్టీని అభినందించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పగానే ఆ క్రెడిట్ ను బీఆర్ఎస్( BRS) కు ఇచ్చింది కూడా ఆయనే. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమనే ప్రచారం బలంగా జరుగుతోంది.
ఇటీవలే తనకు వైసీపీ ( YCP) నుంచి ఆహ్వానం ఉందని చెప్పారు లక్ష్మినారాయణ. కానీ ఆయన ఆ పార్టీలో చేరేందుకు మనసొప్పడం లేదు. జగన్ ( Jagan ) ను జైలుకు పంపిన అధికారిగా పేరున్న లక్ష్మినారాయణ ఇప్పుడు ఆ పార్టీలో చేరితే ఆయన విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. టీడీపీ( TDP )లో చేరితే జగన్ కేసులపై ప్రభావం పడుతుంది. టీడీపీ( TDP leaders ) నేతల డైరక్షన్ మేరకే జగన్ ను జైలు పాలు చేశారని ఇప్పుడు అసలు కథ బయటకొచ్చిందని వైసీపీ ( YCP) విమర్శలు చేస్తోంది. జనసేన( Janasena ) నుంచి ఆయనకు ఎలాంటి ఆహ్వానం లేదు. ఎందుకంటే గతంలో అకారణంగా బయటకు వచ్చిన ఉదంతం ఉండటంతో మళ్ళీ ఆహ్వానించాలని పవన్ ( Pawan Kalyan ) అనుకోవడం లేదు. బీజేపీ( BJP)లో చేరాలనే ఆ పార్టీ నేతలు కోరుతున్నారు కానీ ఎందుకో ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్ ( KCR) కు జేడీ లక్ష్మినారాయణ(Jd LaxmiNarayana ) కనిపించారు. చర్చలు కూడా జరిగాయని స్వయంగా జేడీ లక్ష్మినారాయణ(Jd LaxmiNarayana ) ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయేందుకు కారణం బీఆర్ఎస్సే నని జేడీ పరోక్షంగా చెబుతున్నారు. ఆ ప్రచారానికి జేడీ లక్ష్మినారాయణ మద్దతునిస్తున్నారు. ఈ ఉదంతంతో విశాఖనుంచి బీఆర్ఎస్( BRS అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీలో ఉండటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలను నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయనుంది. ఆ సభలోనే జేడీ లక్ష్మినారాయణ(Jd LaxmiNarayana ) బీఆర్ఎస్( BRS) లో చేరే అవకాశం కనిపిస్తోంది.