సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద బీఆర్ఎస్ లో చేరబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఇందుకోసం బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు కేసీఆర్. మహారాష్ట్రలో ఇతర పార్టీ నేతలెవరూ బీఆర్ఎస్ లో చేరడం లేదు. దాంతో గుర్తింపు కల్గిన వారెవరైనా ఉంటే మహారాష్ట్ర నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా జయప్రదతో బీఆర్ఎస్ సంప్రదింపులు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద ఆ తరువాత సమాజ్ పార్టీలో చేరింది. చాలా ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగింది. అమర్ సింగ్ ఆమెకు రాజకీయ గురువుగా ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా కూడా గెలిచింది. ఆయన మరణం తరువాత జయప్రద భవిష్యత్ ఎటు కాకుండా అయిపొయింది. దాంతో ఆమె కూడా రాజకీయంపై ఇంట్రెస్ట్ తగ్గించేశారు. ఈ నేపథ్యంలోనే జయప్రదను బీఆర్ఎస్ లో చేర్చుకొని మహారాష్ట్ర నుంచి బరిలో నిలిపితే ఎలా ఉంటుందని సమలోచనలు జరుపుతున్నారు కారు పార్టీ నేతలు.
మహారాష్ట్రలో జయప్రదకు మంచి గుర్తింపు ఉంది. కానీ స్థానిక అభ్యర్థుల్ని అక్కడి ప్రజలు ఆదరిస్తారా..? అన్నది ప్రశ్న. కానీ కేసీఆర్ మాత్రం గుర్తింపు ఉంటే చాలు. మిగతా సంగతి తాను చూసుకుంటాననే రేంజ్ లో మహారాష్ట్ర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో లాగా కేసీఆర్ కు మహారాష్ట్రలో అంత ఫేం కూడా లేదు అయినా ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.
Also Read : తెలంగాణలో అధికారం ఎవరిదీ..? వెల్లడి అయిన సర్వే ఫలితం..!