తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. జమిలి ఎన్నికలు లేవని స్పష్టత వచ్చింది. పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే…అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీలు నువ్వా- నేనా అన్నట్లుగా ఎన్నికల సంగ్రామంలో తలపడుతుంటే టీడీపీ – జనసేనల నుంచి పెద్దగా రియాక్షన్ ఉండటం లేదు. అసలు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాజకీయాలపై జనసేనాని పెద్దగా రియాక్ట్ కావడం లేదు.
Also Read : బిగ్ న్యూస్ : పులివెందుల నుంచి జగన్ పై జనసేనాని పోటీ..?
జనసేన పోటీపై పలు అనుమానాలు చెలరేగుతున్న వేళ..ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది. తమకు ఎక్కడైతే బలం ఉంటుందో ఆ నియోజకవ్ర్గాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తోపాటు నల్గొండ , ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీల నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, పఠాన్ చెరు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ తదితర స్థానాల నుంచి జనసేన పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది.
Also Read : జనసేనకు పోటీగా అభ్యుదయ పార్టీ – పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ షాక్
ఈ 32చోట్ల జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేదా ఏదైనా పార్టీతో పొట్టు పెట్టుకుందా..? అనే సందేహాలు ఆ పార్టీ క్యాడర్ లో ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు పవన్. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ పొత్తు ధర్మాన్ని తెలంగాణలోనూ పవన్ పాటిస్తారా..? అని చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో బీజేపీతో జనసేన గతంలోలాగా ఫ్రెండ్లీగా ఉండటం లేదు. టీడీపీతో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కోరుతోంది. దీంతో తెలంగాణలోనూ టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Also Read : 2024 ఎన్నికలు – జనసేన గెలుచుకునే 20స్థానాలు ఇవేనా…?