‘అనుకున్నది ఒక్కటి – అయినది ఒక్కటి – బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అన్నట్లు మారింది ముఖ్యమంత్రి జగన్ పరిస్టితి కాదు, అంధ్రప్రదేశ్ ఉద్యోగులది. జగన్ ఈరోజు కొట్టిన దెబ్బకు ఉద్యోగుల గూబ గుయ్యిమంది. ‘వెలుగు పరిది’ లో పనిచేస్తున్న మండల సంమాఖ్య క్లస్టర్ కోఅర్దినేటర్స్ (ఎం ఎస్ సి సి) ఉద్యోగుల జీతాలు పెంచుతామని జగన్ పలుమార్లు మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారు. కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని వాళ్ళ డిమాండ్లను నెరవేర్చి, జీతబత్యాలు పెంచుతానని ఆయన పలు మీటింగ్లల్లో కూడా మాటిచ్చారు.
ఆయన సి ఎం అయ్యాక ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని కాలం వెళ్ళబుచ్చారు. ఇక ఓపిక నశించిన ఉద్యోగులు ఆందోళన బాట పట్టబోగా ఆర్థిక లోటువల్ల ఎం ఎస్ సి సి ఉద్యోగుల జీతాలు పెంచలేక పోతున్నాము అనే చావు కబురు చల్లగా చెప్పారు జగన్.
అయితే ఈ చావు కబురు తాను చెప్పకుండా పంచాయితీ రాజ్, గ్రామిన అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్తో జి వో విడుదల చేయించారు. ఎఫ్ టి ఈ హెచ్ ఆర్ పాలసీని కూడా ఆమలు చేయడం కుదరదు అని చేతులు ఎత్తేసారు. ఎఫ్ టి ఈ హెచ్ ఆర్ వలన ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది పక్కన పెడితే – మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు – ఎఫ్ టి ఈ హెచ్ ఆర్ పాలసీని అమలు చేయిస్తామని, ఎం ఎస్ సి సి ఉద్యోగుల జీతాలు పెంచుతామని కొందరు ప్రబుద్దులు ఉద్యోగుల నుంచి రూ 20 వేలు మొదలు కొని రూ. 40 వేల వరకు అందినంతా దండుకున్నారు.
ఈ ప్రబుద్దులు ఎవ్వరో కాదు, వైకేపిలో పని చేస్తున్న వాళ్లు, పంచాయితీరాజ్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. దీని మీద జరిగిన టెలికాన్ఫరెన్సు మీడియా ద్వార లోగడ బయటపడింది. దాంతో ఈ విషయం జగన్ వరకు వెళ్ళింది. అయినా ఉద్యోగులకు జగన్ ఏ విధంగాను న్యాయం చేయలేదు. అన్నివిధాలా అన్యాయమే జరిగింది అని ఉద్యోగులు లబోదో మంటున్నారు. పాపం!