కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన తరువాత జగన్ తోపాటు షర్మిల, వైఎస్ విజయమ్మతో భేటీ అయిన పొంగులేటి తాజాగా మరోసారి జగన్ తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరాలనే పొంగులేటి నిర్ణయాన్ని జగన్ సైతం సమర్ధించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పొంగులేటి కంపెనీలకు వేల కోట్ల కాంట్రాక్ట్ లు కట్టబెడుతున్న జగన్, పొంగులేటిని తను అంతర్గతంగా మద్దతు ఇస్తోన్న బీజేపీలో చేరాలని సలహా ఇవ్వకుండా కాంగ్రెస్ లో జాయినైపో అని సూచించడం చూసి ఆ పార్టీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.
పొంగులేటి కోసం ఓ వైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర నేతలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరిపింది. పొంగులేటి బీజేపీలో చేరితే ఏమాత్రం బలం లేని ఖమ్మంలో పుంజుకోవచ్చుననేది కమలం నేతల ఆలోచన. అందుకే ఆయన చేరిక కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. పొంగులేటిని పార్టీలో చేర్చుకునేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా పరిశీలిస్తోంది. అవసరమైతే జగన్ ను రంగంలోకి దింపి పొంగులేటిని బీజేపీలో చేరేలా ఒప్పించడం బీజేపీ అధినాయకత్వానికి చిటికెలో పని. మరి బీజేపీ ఈ మార్గంలో ప్రయత్నాలు ఏమైనా చేసిందా..? లేదా ఆనేది క్లారిటీ లేదు. కానీ తాను విబేధించిన కాంగ్రెస్ లోకి పొంగులేటి వెళ్తుండటాన్ని జగన్ సమర్దించడమే హాట్ టాపిక్ గా మారింది.
పైగా… తెలంగాణలోనున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరడమే సరైనదని పొంగులేటికి జగన్ సూచించడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. జగన్ కు వివేకా హత్య కేసు వంటి కొన్ని కీలక విషయాల్లో సహకరించకపోవడం వలెనే పొంగులేటిని బీజేపీలో చేరేలా కన్విన్స్ చేయలేకపోయరా..? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఏదీ ఏమైనా, పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని జగన్ సూచన చేయడం తెలంగాణ రాజకీయాలతోపాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.
Also Read : ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి , పొంగులేటి..!