‘జబర్దస్త్’ దక్షిణ భారత దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ టివి కార్యక్రమం. దీనిని మించిన రేటింగ్ మరే హాస్య కార్యక్రమనికి లేదు. పైకి నటీనటులు జనాన్ని వ్వించినా, లోపల మాత్రం వాళ్ళ జీవితాలు కన్నీటి కడగల్లు. అదేం విచిత్రమో! ఈ కార్యక్రమంలో పాల్గొనే నటీనటులు తోలి పేమెంట్ అందుకోక ముందే ఎవరితోనో ప్రేమలో పడతారు. ఆ తరువాతే అందులో స్టిరపడతారు.
అలాంటి జంటలలో ఇప్పటివరకు ఒకే ఒక్క జంట ప్రేమలో విజయం సాధించి పెళ్లి చేసుకుంది. ఆ జంటే కమెడియన్ రాకేశ్, జోర్దార్ వార్తల సుజాత. ఈ రోజు వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ‘జబర్దస్త్’ హాస్య నటులు, లోగడ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నటి, మంత్రి రోజా, ఆమె భర్త వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే ఈ ‘నవ్వులాట’ ప్రేమలో విఫలమయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ప్రేమ జంటల కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. అందులో సుడిగాలి సుధీర్ +రశ్మి, ఇమ్మనుయాల్ + హర్ష, ప్రవీణ్ + హైమా…..ఇలా అనేక ప్రేమ జంటలు ఉన్నాయి. విల్లల్లో ఎక్కువగా పేరు సంపాదించింది ప్రేమ జంట మాత్రం సుడిగాలి సుధీర్, రశ్మి. ఎనిమి దేళ్ళ ప్రేమ వ్యవహారం.
వీళ్ళు చాలాకాలం డైటింగ్ చేసినట్లు పుకార్లు పుట్టాయి. పెళ్లి వరకు వెళ్లరు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏదో ఎడబాటు. ఒకే ఈ టివి గూటిలో ఉన్నా ఎవరి దారి వాళ్ళది. ఇమ్మనుయాల్, హర్షది కూడా ఇదే పరిస్టితి. కులం, మతం పేరుతో ఇంట్లో పెద్దలు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని పుకార్లు ఉన్నాయి. ప్రవీణ్, హైమా దాదాపు విడిపోయినట్లు పుకార్లు ఉన్నాయి. వాళ్ళు పండించే హాస్యం కంటే, ఏడిచే ఏడుపే ఎక్కువా. వాళ్ళ గొడవలే ఎక్కువ.
‘జబర్దస్త్’ మొదటి తరంలోని షకలక శంకర్, వేణు, ధన్ రాజ్, మురళి లాంటి వాళ్లు సినిమాల్లోకి వెళ్లి స్టిరపడ్డారు. అప్పటికి మగవాళ్ళే ఆడవాళ్ళ వేషాలు వేసి కామిడి బాగా పండిచారు. ఆ తర్వాత ట్రాన్స్ జన్దర్లు ఎక్కువమంది ఇందులో చేరాడు. ఆడవేషాలు వేసి స్తిరపడిన అబ్బయిలు కొందరు సెక్స్ మార్పిడి చేయించుకుని ఆడవాళ్ళుగా మారారు. కొందరు ‘గె’ లుగా, హోమో సెక్స్ కి మారినట్లు వదంతులు పుట్టాయి.
ఇప్పుడున్న ఆడవాళ్ళలో చాలా మంది ట్రాన్స్ జన్దర్స్ అంటే ఎవ్వరు నమ్మరు. చాలా తక్కువ మంది నిజమైన అమ్మయిలు ఇప్పుడు నటిస్తున్నారు. వాళ్లు రాగానే ముందుగా ఓ గ్రూప్ లో చేరిపోతారు. అక్కడినుంచి ఆ గ్రూప్ వాళ్లతో ప్రేమలో పడతారు. ప్రేమ పేరుతో చిర్నువ్వులు చిందిస్తారు. ఆ ప్రేమ విఫలం కాగానే కన్నీళ్ళు తాగి బతికేస్తుంటారు. ఇదో విచిత్రమైన ‘జబర్దస్త్’ లోకం. షూటింగ్ లో స్క్రిప్ట్ కంటే వీళ్ళ వివాదాల గొడవలే ఎక్కువగా ఉంటాయి.
౦౦౦