చేప బతికుండగా కంపు వాసనా వస్తుంది. అది చనిపోగానే ఆ వాసన పోతుంది అనుకుంటారు. కానీ అది చచ్చినా దాని కంపు పోయిచావదు. అవినీతి కూడా చేపలాంటిదే. వై ఎస్ రాజశేఖర రెడ్డి, అతని కుటుంబానికి నమ్మినబంటులా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీని సిబిఐ ఇంకా నీడలా వెంటాడు తోంది.
ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించింది అని నమ్మిన సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను లోగడ కోర్ట్ రిమైండ్ ఖైదీగా జైలులు పంపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా ఆమె కష్టాలు మాత్రం ఆమెను విడిచిపోలేదు. సిబీఐ సరైనా ధారాలు చూపలేకపోయింది అని తెలంగాణ హైకోర్టు ఈమధ్య ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మొదటినుంచి ఆమె తమ కుటుంబానికి అనుకూలంగా ఉన్నదని భావించిన జగన్ ఆమెను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇద్దరూ జైలుకు వెళ్లి వచ్చిన ఒకే గూటి పక్ష్లులు కదా!
ఆమె అంటే జగన్ కి కూసింత భయం. ఎందుకంటే ఆమె నోరు విప్పితే చాలా నిజాలు బయటికి వస్తాయి, చాలా మంది కి ఇబ్బందులు తప్పవు కాబట్టి. ఆ కుంబకోణం కథ ముగిసింది అని అందరు ఉపిరి పీల్చుకున్నారు. కానీ లంబకోణంలా కథను మళ్ళి మొదటి రీల్ కు తీసుకువచ్చింది సిబీఐ. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించింది అని రుజువు చేసే కొత్త సాక్ష్యాలతో సుప్రీంలో ప్రవేశ పెడుతూ సీబీఐ మళ్ళి కొత్త పిటిషన్ దాఖలు చేసింది. ఆమెకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
ఆమెకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలయింది. వాళ్లు కోర్ట్ లో సమర్పించబోయే ఆ కొత్త సాక్ష్యాల ఏమిటో తెలియవు. ఒకవేల అవి బలమైన సాక్ష్యాలయితే ఆమెకు మళ్ళి జైలు శిక్ష తప్పేలా లేదు. ‘ముత్యాల ముగ్గు’ సినిమా లోని రావు గోపాలరావు డైలాగ్ గుర్తుకు వస్తోంది. ‘దీని తస్సా రవ్వల బొడ్డు! చేసిన పాపం ఉరికే పోతున్దేంటి? దాని లోతెంతో, దాని పొడవెంతో, దాని వెడెల్పు ఏంతో తెలుసుకో వద్దూ? ఉరికే తిని తొంగుంటే మడిసికి గొద్దుకు తేడా ఏంటి?’ అని.