తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణాన కేంద్రంతో వైరం పెట్టుకున్నాడో ఏమో కాని టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర నివాసాలలో ఈడీ అధికారులు తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లను తీసుకెళ్ళారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, బంధుల ఇళ్ళు, వ్యాపార సంస్థలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. యాభై బృందాలు ఈ సోదాలు చేస్తున్నాయి.
మంత్రి మల్లారెడ్డి కుబేరుడు. ఆయనకు ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజ్ లతోపాటు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అయితే, ఆయనపై భూకబ్జా అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంస్థలకు అనుమతులను ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి తెచ్చుకున్నాడని టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. తను అన్ని ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదని రేవంత్ పలుమార్లు ప్రశ్నించారు.
Also Read : నన్ను గవర్నర్ చేయండి సారూ..! షా ముందు శశిధర్ రెడ్డి వేడుకోలు
అప్పట్లో టీఆర్ఎస్ – బీజేపీల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో దర్యాప్తు సంస్థలు మిన్నకుండిపోయాయి. ఇప్పుడు టీఆర్ఎస్ – బీజేపీల మధ్య వైరం కొనసాగుతుండటంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నిజానిజాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల వ్యవహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ ను ఎగ్గొట్టారనే కంప్లైంట్స్ ఉన్నాయి. వీటిని ఐటీ అధికారులు బయటపెడితే మల్లారెడ్డి కటకటాల్లోకి వెళ్ళాల్సిందే.
మొత్తంగా కేసీఆర్ రాజకీయ ఎదుగుదల కోసం బీజేపీతో పెట్టుకున్న వైరం, సొంత పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిందని టీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు.