కేసీఆర్ అవినీతి, భూదోపిడీకి సంబంధించిన ఆధారాలను వెలికితీసి కల్వకుంట్ల కుటుంబ అక్రమాలను రేవంత్ రెడ్డి బయటపెడుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ కోవర్టులు అలర్ట్ అయ్యారా..? రేవంత్ లేవనెత్తుతోన్న అంశాలపై జనాల అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ ఆపరేషన్ షురూ చేశారా..? ఆ సీనియర్ నేత డైరక్షన్ లోనే ఆ నిత్య అసంతృప్త నేత పార్టీ మార్పు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అవినీతి చిట్టాను రేవంత్ రెడ్డి బయటపెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ లో కొంతమంది నేతలు హైడ్రామా నడపి బీఆర్ఎస్ కు ఫేవర్ చేసేలా వ్యవహరించడం రొటీన్ గా మారుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ భూ దోపిడీ మాయాజాలాన్ని ఆధారాలతో సహా రేవంత్ బయటపెడుతుంటే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారని మీడియాకు లీకులివ్వడం వెనక రాజకీయ వ్యూహం దాగి ఉండొచ్చునని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఫండింగ్ ఇచ్చేంతగా కేసీఆర్ ఎలాంటి అక్రమ మార్గాల్లో సంపాదించాడో రేవంత్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఈ విషయం జనాలకు రీచ్ కాకుండా ఉండేందుకే ప్రీప్లాన్డ్ గా మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిక డ్రామా అని అభిప్రాయపడుతున్నారు.
గతకొంతకాలంగా రేవంత్ అంటేనే మహేశ్వర్ రెడ్డి ఒంటికాలి మీద లేస్తున్నారు. ఆ మధ్య ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. రేవంత్ తో గ్యాప్ మెయింటేన్ చేస్తూ రేవంత్ వ్యతిరేక టీమ్ లీడర్ గా అనధికారికంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అవినీతి, భూదోపిడీ కథలను కళ్ళకు కట్టినట్లుగా రేవంత్ వివరిస్తుంటే ఈ వార్తకు ప్రాధాన్యత లభించకుండా చేయడం కోసమే ఏలేటి బీజేపీలోకి అనే లీక్ ను వదిలినట్లుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏలేటి అనుచరులే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారని వాట్సప్ లో స్టేటస్ పెట్టి ఈ ప్రచారానికి ప్రాధాన్యత లభించేలా చేయడంతో ఖచ్చితంగా ఇందులో ఎదో లోగుట్టు ఉందనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
అసలు విషయం బయటకోస్తుందని గ్రహించే ఇప్పుడు ఆ ప్రచారాన్ని ఖండించేందుకు.. ఇది రేవంత్ టీమ్ పనేనని చెప్పేందుకు మహేశ్వర్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లుగా ఉందన్న వాదనలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అయితే..బీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేలా మహేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే ప్రచారం వెనక బీఆర్ఎస్ కోవర్ట్ గా ఆరోపణలు ఎదుర్కొనే టీపీసీసీ మాజీ అద్యక్షుడి హస్తం ఉందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఎన్నికల ఖర్చులు భరిస్తానని ఆఫర్లు ఇస్తోన్న కేసీఆర్ ను నమ్మేవారేలేరా..!!