బిఆర్ఎస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి అని కాంగ్రెస్ ఎప్పటినుంచో వాదిస్తోంది. అది నిజమని ఏమ్మేసి కవిత ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో’ బయటపడుతోందో. బిఆర్ఎస్, బిజెపి పైకి బద్దశత్రువుల్లా కనిపించినా లోలోపల ఒప్పందాలు వేరుగా ఉన్నాయి.
ఇది బాక్సింగ్ పోటీ లాంటి ఒప్పందాలు. బరిలోకి దిగిన ఇద్దరు బాక్సర్ లు చూడటానికి కొట్టుకుంటున్నట్లే ఉంటుంది. అది కేవలం ఆక్షన్ మాత్రమే. నిజానికి గుద్దుకునే ఆ పంచ్ లో బలముండదు. వాడు కొట్టినట్లు అరుస్తాడు. వీడు దెబ్బ తిన్నట్లు విలవిలలాడుతాడు. చివరికి ఒకడు కావాలని ఓడిపోయినట్లు నటిస్తాడు. మరొకడు గెలిచినట్లు అరుస్తాడు. బయటికి వచ్చాక ఆ బెట్టింగ్ లో గెలిచిన డబ్బును ఇద్దరు పంచుకుంటారు. తర్వాత కలిని మందు కొడతారు.
సరిగ్గా ఇక్కడ కూడా ఇలాంటి ఆటే కొనసాగుతోంది. బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతున్నట్లు బిజెపిని భయపెడుతోంది. బిజెపి నిజంగా భయపడుతోందో, లేక భయపడి నట్లు నటిస్తోందో తెలియదు. కానీ బిఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టి తన వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఇందులో భాగమే ఎమ్మెల్సి కవిత ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’. ఆమెను ‘నిందితురాలు’ అని ఈడి తో సమన్లు పంపి ఆమెను దాదాపు అరెస్ట్ చేయించే స్టాయికి తీసుకు వచ్చింది.
తన కూతురిని కాపాడుకోవాలనే తపనతో కెసిఆర్ తన స్వరం తగ్గించాడు. కేటిఆర్, హరీష్ రావులను న్యూ ఢిల్లీ కి రాయబారానికి పంపి చీకటి ఒప్పందాలు చేయించారు కెసిఆర్. ఇవి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అందులో మార్పులు – చేర్పులు చేసుకునే కొత్త ఒప్పందాలు. అవి బాగానే కుదిరాయి.
అందుకే బిజెపి కూడా తన స్వరం తగ్గించి నిన్న ఈడితో చిలకపలుకులు పలికించింది. నిన్నటివరకు కవితను
‘నిందితురాలు’ అని నోటిసులు పంపిన ఈడి ఇప్పుడు ఒక్కసారిగా ‘యూ’ టర్న్ తీసుకుంది. కవిత కేవలం ‘అనుమానితురాలు ‘ మాత్రమే, ‘నిందితురాలు’ కాదు అని నిన్న చిలుకపలుకులు పలికింది. అందరికి షాక్ ఇచ్చింది. అంటే ఈ కేసుని నీరుకార్చే ప్రయత్నాలను బిజెపి మొదలుపెట్టింది అని తెలుసుతోంది.
అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిజమని రుజువు చేస్తోంది. ఎంతైనా కాంగ్రెస్ వందేళ్ళ సీనియర్ పార్టీ. ఇలాంటి బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఎన్నింటిని చూడలేదు? ఎన్ని పార్టీలు ఇలాంటి కుట్రలు పన్ని కాలగర్భంలో కలిసిపోలేదు?