ఇక కల్వకుంట్ల కుటుంబం పని అయిపొయింది. జైలుకు వెళ్ళడం ఖాయమని బీజేపీ హడావిడి చేయగా… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీల నేతల అరెస్టులు ఉంటాయని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు పేల్చారు. రోజులు గడుస్తున్నాయి కాని అరెస్టులు లేవు. కేసుల విచారణలో ఎలాంటి ముందడుగు లేదు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మెల్లగా నిందితులకు బెయిల్స్ వస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి చేరినా ఇంకా కేసు నమోదు చేయలేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాతోపాటు కవితల అరెస్ట్ తథ్యమని లీకులు ఇచ్చినా..ఈడీ, సీబీఐలు వారిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాని చార్జీషీట్ కాని దాఖలు చేయలేదు.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు – వందల కోట్ల లెక్క తేల్చే పనిలో ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఓ నిందితుడి చార్జీషీట్ లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక భాగస్వామి అని ఈడీ పేర్కొంది. ఈ లిక్కర్ స్కామ్ లో కవిత పెద్దమొత్తంలో లాభాలు గడించిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేకుండా చార్జీషీట్ లో కవిత పేరును చేర్చే అవకాశం లేదు. అయినప్పటికీ కవితను అరెస్ట్ చేసేందుకు ఎందుకు వెనకా ముందు ఆలోచిస్తున్నారు..? అన్నది అంతుబట్టడం లేదు.
Also Read : కేసీఆర్ సన్నిహితులే బీజేపీకి విరాళం ఇస్తుండ్రు..!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఈ కేసును సీబీఐ ఇంకా టేకప్ చేయలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో తెలియదు. ఇదిలా ఉండగానే.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ప్రచారం జరిగింది. కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారని సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. కాని తెలంగాణ సర్కార్ అప్పీల్ కు వెళ్ళలేదు. అదే సమయంలో సీబీఐ కూడా సైలెంట్ గానే ఉంది. దీంతో అసలేం ఏం జరిగి ఉంటుందని అంత ఆరా తీస్తున్నారు.
Also Read : బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుందా..?
దర్యాప్తు సంస్థలు దూకుడు తగ్గించడానికి రెండు కారణాలు ఉన్నట్లు విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ , బీజేపీల మధ్య ఒప్పందం కుదరడంతోనే దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయ్యాయని ఓ కారణంగా చెప్తున్నారు. కాని ఇది ఎంతవరకు నిజమో చెప్పలేం. రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలిస్తే అధికార పార్టీ షరతులకు తలొగ్గి ముందుకెళ్ళడం చేస్తుంటాయి. కాబట్టి , బీజేపీ చేతిలో ఆయుధం ఉండటంతో బీఆర్ఎస్ బీజేపీ విధించిన షరతుకు ఒకే చెప్పి ఉండొచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి – కేసీఆర్ లో ఆందోళన..?
ఇక, రెండోది.. అదును చూసి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెయిట్ చేస్తున్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, బీఆర్ఎస్, బీజేపీలు అరెస్టులతో హడావిడి చేసి ప్రస్తుతం సైలెంట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.