ఆంధ్రప్రదేశ్ ఇసుక మాఫియా దేశం లోనే నెంబర్ వన్. ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా పైసా వసూల్ చేసేది ఇసుక మాఫియా మీదే. రాజకీయ నాయకులకు, మంత్రులకు ఇది కల్పతరువు లాంటిది. ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక కాంట్రాక్ట్ లు ఇచ్చినప్పటికీ మంత్రుల అధీనంలో, లేదా ఎం పి, ఎమ్మెల్లే ఆధీనంలోనే అంతా జరుగుతుంది. సగం వైట్, సగం బ్లాక్ దందాకు ఇది పెట్టింది పేరు.
ఇది ఓ సాలెగూడు లాంటిది. కొత్త పురుగులు వస్తే బయటపడవు. సాలె పురుగుకు బలి కావలసిందే. ఇలాంటివి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కళ్లేపల్లి ప్రేమ్ రాజ్ అనే కొత్త ఇసుక కాంట్రాక్టర్ కూడా ఇలాగే ఇసుక మాఫియా అనే సాలెగూడులో ఇరుక్కుని బలయ్యాడు అనే పుకార్లు షికార్లు చేసున్నాయి. ఇది సాధారణ ఆత్మహత్య అని అందరు తొలుత భావించారు. కానీ దీనివెనుక రాజకియ హస్తం ఉన్నదనే అనుమానాలు మొదలయ్యాయి.
కళ్లేపల్లి ప్రేమ్ రాజ్ బి టెక్ చదివాడు. మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బతుకుతున్నాడు. ఇతనికి తెలిసిన ఓ ఎమ్మెల్లే అతనిని మెల్లిగా ఇసుక వ్యాపారం చేస్తే ఇంతకుమించి కోట్లు సంపాదించుకోవచ్చు అని ఉసిగొలిపాడు. ప్రేమ్ రాజ్ తన ఆస్తిపాస్తులు అమ్మి రూ. 21 కోట్లు తీసుకువచ్చి ఇసుక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. జేపీ పవర్ వెంచర్స్ ప్రైవేటు సంస్థలో పశ్చిమగోదావరి ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రతి నెలా రూ. 21 కోట్లు చెల్లించాలి. అయితే ప్రతినెలా దాదాపు రూ. 25 కోట్లు వస్తాయి, దానినే ప్రతినెలా రొటేషన్ చేయవచ్చు అని నమ్మాడు. కానీ అతనికి రావలసిన డబ్బులు రాలేదు. రాజకీయ నాయకులకు ఇవ్వవలసిన కమిషన్ లో తేడాలు వచ్చాయి. కానీ ప్రతి నేలా రూ. 21 కోట్లు ఎట్టిపరిస్టులోను చెల్లించాలి. లేకపోతే ఆ కాంట్రాక్టు వేరేవాళ్లకు ఇస్తారు. అక్కడితో అతను ఇరకాటంలో పడ్డాడు.
తన స్నేహితుడు గౌతమ్ ని పిలిపించి తన కష్టాలు చెప్పుకున్నాడు. ఉన్నపలంగా రూ. 21 కోట్లు అప్పులు ఇచ్చేనాథుడు కనిపించలేదు. ఆ స్నేహితుడు ఎంతో మనో బలం ఇచ్చినా వినకుండా ప్రేమ్ రాజ్ రైలు కింద పది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త ముందుగా ఆత్మహత్యగా మొదలయ్యి నప్పటికీ రాజకీయ రంగు పులుముకుంది. దీనివెనుక ఎవరి హస్తం ఉందో పోలీసులే తేల్చాలి.