అకీరానందన్ విషయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. అకీరానందన్ ను పవన్ కళ్యాణ్ కొడుకు అన్నందుకు ఆమె సీరియస్ గా తీసుకొని పెద్ద పోస్ట్ చేశారు. అకీరానందన్ ను పవన్ కొడుకు అంటే రేణు దేశాయ్ కొడుకు కాదని అర్థం కాదు. ఈ విషయం ఆమెకు తెలియనిది కాదు. పవన్ కొడుకు అంటే రేణు నుంచి అకీరాను వేరు చేస్తున్నట్టు కూడా కాదు కానీ, ఎందుకో ఎప్పుడు లేని విధంగా సీరియస్ అవుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. చాలా కాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం అయ్యే పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
రేణు దేశాయ్ తాజా పోస్ట్ వెనక పెద్ద తతంగమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు కూడా రేణు దేశాయ్ ఇలాగె వ్యవహరించారు. పవన్ అంటేనే గిట్టని సాక్షి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించి పవన్ కు ఇబ్బందికరమైన కామెంట్స్ పాస్ చేశారు. ఆ తరువాత యాంకర్ స్వప్నతో కలిసి సాక్షి ఛానెల్ లో పే రోల్ లో కొన్నాళ్ళు ఉన్నారని కూడా చెబుతారు. ఎన్నికలు ముగియగానే రేణు సైలెంట్ అయారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా రేణు దేశాయ్ మళ్ళీ వివాదాస్పద పోస్టులు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ కావాలనే ఇలా చేస్తున్నారా..? లేక అకీరాను పవన్ కొడుకు అంటే తన నుంచి దూరం అవుతాడనే బాధతోనే ఆమె ఈ కామెంట్స్ చేస్తున్నారా..? అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. ఏదీ ఏమైనా ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో అకీరాను పవన్ కొడుకు అన్నందుకు ఆమె ఇంత రచ్చ చేయడం కావాలని చేస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
Also Read : నిహారిక విడాకుల పంచాయితీలోకి మెగాస్టార్ ఎంట్రీ – చీవాట్లు పెట్టారా..?