బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రధాని మోడీ ఆన్ లైన్ ద్వార రైళ్ళను, విమానాలను, కంపెనీ ప్రారంభోత్సవాలు చేస్తారు. కానీ బిజెపి అధికరలో లేని రాష్ట్రాలల్లో మాత్రం తమ పార్టీ పబ్లిసిటీ చేసుకోడానికి పని కట్టుకుని వస్తారు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు ఏదో ఒక వంకతో వచ్చి బిజెపి మైలేగిని పెంచుతున్తున్నారు మోడీ.
ఈ రోజు సికింద్రాబాద్ కు మోడీ వచ్చేది పక్కా అధికారిక పర్యటన. బిజెపి పార్టీ కి సంబంధించి ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ లు ఉండకూడదు. ముఖ్యంగా ఆయన రాజకీయ గురించి అస్సలు మాట్లాడకూడదు. కేవలం ఆ విభాగం అభివుద్ది గురించి, దానిని బాగోగుల గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది ఎప్పుడో మోడీ మరిచిపోయారు.
ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా సిఎం స్వాగతం చెప్పాలి. ప్రధానితోపాటు వెంట ఉంది, అన్ని కార్యక్రమాలల్లో పాలు పంచుకోవాలి. ప్రధానిని తిరిగి పంపేవరకు పండగకు వచ్చిన కొత్త అల్లుడిలా చూస్కోవాలి. కానీ కెసిఆర్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం చెప్పడం మానుకున్నారు. మోడీ సభలల్లో పాల్గోవడం కూడా మానుకున్నారు. అయినా మోడీ తెలంగాణకు అవమాన భారం మేసేందుకు వస్తారు. ఇది ఎలాంటిది అంటే, పిలువని పేరంటానికి వచ్చి, అన్నం మెక్కి పోవడమే.
మోడీ ప్రోటోకాల్ పక్కపెట్టి మైక్ పట్టుకోగానే కాంగ్రెస్, బిఅరేస్ పార్టీలను తిట్టడమే. అందుకే కెసిఆర్ కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీని లెక్కచేయడం లేదు. మోడీ తెలంగాణకు అధికారికంగా పర్యటనను వచ్చిన ప్రతిసారి బిజెపి మైలేజ్ పెచుకున్తున్నారు. ఇలా కాకుండా అనధికారిక పర్యటన మీద వచ్చి బిజెపి ప్రచారం చేస్త తప్పు కాదు.
కానీ రైలు ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ కు అధికారిక పర్యటన మీద మోడీ ఈ రోజు వస్తున్నారు. కానీ దీనిని ఎన్నికల ప్రచారంగా బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అని అడుగు అడుగున కనపడుతోంది. ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు బూడిద పాలవుతున్నాయి.
నిజానికి దీనికి రైల్వే శాఖ మంత్రి వచ్చినా సరిపోతుంది. నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాగో ఉన్నారు. ఇంత చిన్న పనికి మోడీ రావాలా? దేశంలో కరోనా మరోసారి పడగ విప్పుతుంటే మోడీ ఇప్పుడు రావడం అంత అవసరమా?
వచ్చినా రైల్ ని ప్రారంభించి తిన్నగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కీ వెళ్లిపోటారా అంటే అదీ లేదు. అక్కడినుంచి ఎన్నికల ప్రచారంలాగా పెరేడ్ గ్రౌండ్ కి వెళ్లి బహితంగా సభలో ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో రైల్వే గురించి ఉండదు అని అందరికీ తెలుసు. ‘రైలు’తో మొదలు పెట్టి ‘కార్’ లోంచి దిగుతారు.
మోడీ ప్రసంగించే సభకుగాను పెరేడ్ గ్రౌండ్లో లక్షల మంది వస్తున్నారు. సభలో, దానిని చుట్టుపక్కల పార్టీ ప్రచార సామాగ్రి ఉండకూడదు. ప్రచారం జరగకూడదు. కానీ ప్రధాని కాన్వాయ్ వెళ్లే రోడ్ల మీద బిజెపి నాయకులు పోటిపడి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ పెట్టారు. మొత్తం కాషాయం మాయం చేశారు.
తొక్కలో ప్రోటోకాల్, రాజ్యాంగ నియమ నిభందనలు ఎవరికి కావాలి? ఎవడి స్వార్థం వాళ్ళదే. అందరకి అధికారం కావాలి. ప్రజాసేవ ఎవడికి కావాలి? ప్రజల సొమ్ము బూడిదపాలు అయ్యితే ఎవడికి పట్టింది నేస్తం?