ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బీజేపీపై దుమ్మెత్తిపోసే కేసీఆర్, కొద్ది రోజులుగా బీజేపీ గురించి ప్రస్తావించడం మానేశారు. అసలు ప్రత్యర్ధి కాంగ్రెస్ అనుకుంటున్నారో, బీజేపీని విమర్శిస్తే లేని తలనొప్పులు వస్తాయని ఆందోళన చెందారో కాని బీజేపీపై కేసీఆర్ యుద్ధ విరమణ చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల రెండు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ రెండు బహిరంగ సభలో బీజేపీ ప్త్రస్తావనే తీసుకురాలేదు. కేవలం కాంగ్రెస్ నే కార్నర్ చేశారు.
వాస్తవానికి తెలంగాణలో బీజేపీ పటిష్టం కావడానికి కేసీఆర్ ప్రధాన కారణం. ఏమాత్రం బలం లేని బీజేపీని పదేపదే విమర్శించి, బీఆర్ఎస్ ప్రత్యర్ధి బీజేపీనే అనే విధంగా ప్రజల్లోకి ఓ రకమైన భావనను క్రియేట్ చేశాడు. కాంగ్రెస్ ఎక్కడుంది..? అంటూ ఎగతాళి చేస్తూ బీజేపీపై పోరు చేస్తానని బీరాలు పలికాడు.దాంతో పోటీ మొత్తం బీజేపీ – బీఆర్ఎస్ మద్యే అన్నట్లు వాతావరణం ఏర్పడింది.
కొన్ని రోజులుగా కేసీఆర్ బీజేపీని మునుపటి రీతిలో విమర్శించడం లేదు. కాంగ్రెస్ పై సమరభేరి మోగించినట్లు ఫైర్ అవుతున్నారు. బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య అండర్ స్టాండింగ్ ఉందనే విమర్శలు, లిక్కర్ స్కామ్ లో కవిత కోసం కేసీఆర్ బీజేపీపై యుద్దవిరమణ చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనా కేసీఆర్ బీజేపీని విమర్శించకపోవడం మాత్రం కమలం పార్టీకి మైనస్ అని చెబుతున్నారు.
Also Read : బీజేపీకి ఈటల టెన్షన్ – కీలక పదవి ఆఫర్..!!