చట్టం ప్రకారం జుబ్లిహిల్స్, బంజారా హిల్స్ లో నాలుగు లేదా స్పెషల్ పెర్మిషన్ తో మాత్రమే బహుళ అంతస్తులు కాటాలి. ఇది చాలా కాలంగా ఉన్న నిబందన.
బంజారాహిల్స్ లో నందమూరి బసవతారకం కాన్సర్ ఆస్పత్రి నాలుగు అంతస్తులతో ఉంది. వాళ్ళు రెండు అంతస్తులు పెంచుకోవడానికి అనుమతి కోరితే కేసీఆర్, కేటిఆర్ దానిని తోసిపుచ్చారు. వాళ్ళు నిబంధనను సరిగ్గా పాటించినందుకు సంతోషమే.
కానీ అదే ఆస్పత్రి పక్కన, కేబిఅర్ పార్క్ ఎదుట బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 14 లో కేసిఎస్ డెవలపర్స్ అధినేత కుర్ర శ్రీనివాసరావు భూమి ఉంది. ఇందులో ఐదు అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ కి బదులు కేసిఆర్ 16 అంతస్తులు కట్టుకోడానికి అనుమతి ఇచ్చారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది 2700 గజాలు. దీనిని కేసీఆర్ స్వయంగా తన పేరుతో ఇల్లీగల్ గా రాయిన్చుకున్నాడు అని ఆరోపించారు. కేవలం ఆరోపించాకుండా తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపారు. కావాలంటే మీడియాను రేపు ఉదయం పదకొండు గంటలకు అక్కడికి తీసుకు వెళ్లి రుజువు చేస్అతానని బల్ల గుడ్డి మరి చెప్పారు.
దీనికి తోడూ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటానికి కారణం కూడా ఇలాంటి బహుళ అంతస్తుల నిర్మానాలే అని ఆయన ఆవేదన చెందారు. నిత్యం ట్రాఫిక్ తో కిటకిటలాడే బంజారా హిల్స్, జుబ్లిహిల్స్ లో 16 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ కడితే కొన్ని వందల కార్లు, బైక్ లతో ఆ ఏరియ బ్లాక్ కాదా అని అయన నిలదీశారు. కేబిఆర్ పార్క్ కి కొన్ని వేలమంది శ్రీమంతులు కార్లల్లో వస్తుంటారు. ఇప్పటికే వాళ్ళు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్పడు ఆ ఏరియాలో ఇలాంటి బహుళ అంతస్తు కడితే ట్రాఫిక్ ఏమైపోవాలి? అని ఆయన నిలదీశారు. ఒక్క కమర్షియల్ కాంప్లెక్స్ తో వందలాది సమస్యలు వస్తాయి కాబట్టే నగరం నడిబొడ్డున ఇలాంటి వాటికీ అనుమతి ఇవ్వరని కేసీఆర్ మరిచారా అని నిలదీశారు.