బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడంతో కేంద్ర పెద్దలు కన్నెర చేశారని కథనాలు వచ్చాయి. సంజయ్ అరెస్ట్ వివరాలను ప్రధాని మోడీ, అమిత్ షా లు బీజేపీ జాతీయద్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కార్యక్రమాల్లోనున్న బండి సంజయ్ ని అర్దరాత్రి అరెస్ట్ చేయడం పట్ల మోడీ , షా లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బుధవారమంతా బీజేపీ ప్రొ మీడియా ప్రచారం చేసింది.
బండి సంజయ్ ను ఆదరాబాదరాగా అరెస్ట్ చేసి అనవసరంగా బీజేపీతో బీఆర్ఎస్ కెలుక్కుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై మోడీ , షా లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ కు ఇక మూడినట్లేనని అంచనా వేశారు. షా ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్ పై షా దృష్టి సారిస్తారని…బీఆర్ఎస్ కు చుక్కలు చూపించేందుకు కమలం నేతలు కన్నెర చేస్తారనే విశ్లేషణలు వినిపించాయి.
తెలంగాణ సర్కార్ ను అస్థిర పరిచేందుకు బండి సంజయ్ కేంద్ర పెద్దల డైరక్షన్ లో కుట్రకు తెరలేపాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.?ఇది ఓ రకంగా బీజేపీ అహం మీద దెబ్బకొట్టడం లాంటిదే. గతంలో ఫామ్ హౌజ్ కేసులో బీఆర్ఎస్ నేతలు ఇంతకన్నా దారుణంగా కామెంట్స్ చేసినా బీజేపీ నేతలు ఏమి చేయలేకపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నా… ఇతర నిందితుల్ని అరెస్ట్ చేసినా కవితను మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. కానీ బీఆర్ఎస్ ఏ చిన్న అవకాశం దొరికినా ఎక్కడిక్కడ అణచివేస్తోంది. కాని కేంద్రంలో అధికారమున్న బీజేపీ పార్టీ నేతలను ప్రాంతీయ అధికార పార్టీ బీఆర్ఎస్ అరెస్ట్ చేస్తోన్నా బీఆర్ఎస్ ను ఏం చేయలేక చేత్తులేత్తేస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే ఓ రకంగా బీజేపీ నిస్సహాయంగా కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టులు చేయగలిగే అవకాశం ఉంది. ఫామ్ హౌజ్ కేసు సీబీఐ చేతికి వచ్చింది. అయినా బీజేపీ బాధితురాలిగానే ఉండటానికే ప్రయత్నిస్తోందంటే అది చేతకానితనం అనే అభిప్రాయం బలపడటానికి కారణం అవుతోంది.
అయితే బండి సంజయ్ అరెస్ట్ పై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతీకార చర్యలకు దిగితే మాత్రం బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయం. అది కవిత అరెస్ట్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : రేవంత్ ఫిర్యాదుతో రంగంలోకి ఈడీ- కేటీఆర్ లో ఆందోళన..?