కొన్నాళ్ళపాటు బుల్లితెరపై మహారాణిలా సందడి చేసింది యాంకర్ శ్రీముఖి. తనదైన యాంకరింగ్ తో అభిమానులను అలరించింది. పంచ్ లు, ఏకధాటిగా మాట్లాడేగలిగే శ్రీముఖిని యాంకర్ గా బుల్లితెరను శాసించేలా చేసింది. కామెడి షో లలో యాంకరింగ్ చేస్తూనే అడపాదడప సినిమాలోనూ నటించేది.
యాంకర్లలో సుమ తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది శ్రీముఖి. తన ఎనర్జీ.. స్పాంటేనియస్ పంచ్ లు, చలాకీగా మాట్లాడటం.. క్యూట్ , క్యూట్ మాట్లాడుతూ ఎంతటి వారినైనా అట్రాక్ట్ చేయడం శ్రీముఖికే సొంతం. అయితే, మూడు పదుల వయస్సులోకి వచ్చినా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని చర్చ జరుగుతోంది. ఇందుకు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీముఖి కాలేజ్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించిందట. అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిందట. అతని ప్రేమని నిజమని నమ్మి సరదాగా మెలిగిందట. ఆ తరువాత అతని నిజ స్వరూపం తెలియడంతో శ్రీముఖి అతని దూరం పెట్టిందట. శ్రీముఖి దూరం పెట్టడంతో అతను ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడట.
వల్గర్ వీడియోస్ పంపడం.. ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ శ్రీముఖికి పంపి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడట. దాంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక, తనలో దాచుకోలేక తనలో తానే కొంతకాలం కుమిలిపోయిందట. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు శ్రీముఖి పెద్ద యుద్దమే చెసిందని.. ఆ తరువాత ఈ బాధనుంచి తేరుకొని కెరీర్ పై గట్టిగా ఫోకస్ చెసిందట.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడు చేసిన మోసాన్ని తట్టుకోలేకే పెళ్లి అనే ప్రస్తావన తెచ్చినప్పుడల్లా శ్రీముఖి మాట దాటవేస్తుందని అంటున్నారు.