బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆ కోవర్టులు ఎవరో ఈటల చెప్పకపోవడంతో వ్యూహాత్మకంగానే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు బీజేపీ వర్గాలు అనుమనిస్తున్నాయి. బండి సంజయ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పై అలుపెరగకుండా పోరాటం చేస్తోన్న బండి సంజయ్ ను అద్యక్ష పీఠం నుంచి దించేందుకే కోవర్టులు అంటూ కొత్త నాటకాన్ని ఈటల తెరపైకి తీసుకొచ్చారని సందేహిస్తున్నారు.
అదే సమయంలో ఈటల ప్రవర్తనపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతుందని నివేదికలు వచ్చినప్పుడల్లా ఈటల ఎదో ఓక రూపంలో పార్టీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. తెలంగాణలో బలపడుతోన్న బీజేపీని బలహీనపరిచేందుకే అసైన్డ్ భూముల కేసుతో ఈటలను బీజేపీలోకి కేసీఆరే పంపించాడా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిజంగా..పార్టీలో కోవర్టులు ఉంటే ఈటల బయటపెట్టాలి.. అధిష్టానంకు వివరించాలి కానీ ఈటల బహిరంగంగా ఈ కామెంట్స్ చేయడంబట్టి.. ఈటలనే కేసీఆర్ కోవర్ట్ అయి ఉండొచ్చునని సందేహిస్తున్నారు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకోసమే ఈటల కోవర్ట్ డ్రామాలు ఆడుతున్నారని సందేహిస్తున్నారు.
కేసీఆర్ డైరక్షన్ లో బండి సంజయ్ పాపులారిటీ తగ్గించేలా ఈటల వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. అందుకే.. బండి సంజయ్ పై అధిష్టానానికి తరుచుగా ఫిర్యాదులు చేయడం వంటివి చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని పలువురు నేతల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని బండి సంజయ్ పై ఈటల ఫిర్యాదు చేశారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారశైలిని గమనించే ఆయన కోవర్ట్ రాజకీయాలపై అంచనాకు వచ్చే… మొదటి నుంచి ఈటలకు ప్రధాన మద్దతురాలిగా కొనసాగిన విజయశాంతి.. అసలు వాస్తవాలు తెలుసుకొని బండి సంజయ్ కోటరీలో చేరారని ఆ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.
Also Read : 10 కోట్ల పంచాయితీ – ఈటలపై హైకమాండ్ సీరియస్