గత రెండేళ్లుగా చేసిన సర్వేలు దేశంలోనే అతి పేదరికం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని తేల్చాయి. ఇది షాకింగ్ వార్త కాదు.
కానీ దేశంలోనే అత్యధిక సంపన్న సిఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త రికార్డ్ నెలకొల్పారు. తాజాగా ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. దేశంలో మిగతా 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్ కంటే తక్కువేనని ఈ సంస్థలు వెల్లడించాయి. అతి పేదరికంలో వెస్ట్ బెంగాల్ ముఖ్య మంత్రి గా మమతా బెనర్జీ ఉన్నారు. శభాష్ తల్లి. ఇక ఎక్కువ అప్పులు చేసిన జాబితాలో కేసీఆర్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంచలన విషయాన్ని బయటపెట్టాయి.
దేశంలోనే చంద్రబాబు వ్యక్తిగత సంపాదనలో అత్యంత ధనికుడైన మూడో ఎమ్మెల్యే అని ఏడీఆర్ వెల్లడించింది.
దేశంలో వ్యక్తిగత ధనిక ఎమ్మెల్యేల జాబితాలో రూ.1015 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఎన్.నాగరాజు ఉన్నారు. ఇక రెండో స్థానంలో రూ.840 కోట్ల ఆస్తులతో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారు.
ఇక అత్యధిక ధనవంతులైన ఎమ్మెల్యేల్లో దేశంలోనే మూడో స్థానంలో రూ.668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు ఉన్నాయి. నాలుగో స్థానంలో రూ.661 కోట్ల ఆస్తులతో జయంతి భాయ్ పటేల్ నిలిచారు. కే సీ ఆర్ కి ఆస్తులు తక్కువా – అప్పులు ఎక్కువా>
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ధనికుడైన ఎమ్మెల్యే గా జగన్ తర్వాత స్థానంలో చంద్రబాబు నిలిచారు. ఇది పచ్చి నిజం. మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు ఇలా కోట్లకు పడగేత్తారు కాబట్టే ఏపి ప్రజలు చకనాకిపోయి పేదలుగా మారారు. వీళ్ళు నిలువు దోపిడీ చేయకపోతే ప్రజలు ఎలా పేదలు అయ్యేవారు? వీళ్ళు ఎలా శ్రీమంతులు అయ్యేవారు.
అందుకే చంద్రబాబు పంచిన ఉచిత చీరాల కోసం పేద మహిళలు లైన్ లో నిలబడి, తొక్కిసలాటలో ప్రాణాలు వదిలారు.
శభాష్ రాజకీయమా? అన్నం పెట్టిన ఓటర్ కి సున్నం పెట్టావు.