తనపై అసత్య ఆరోపణలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చి మరీ హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు బీఆర్ఎస్ అధినేతను ఉద్దేశించినవే. అధినేతకు హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సోషల్ మీడియా కూడా సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మౌనమే మేలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుంది.
బీజేపీ పగబడితే ఎలా ఉంటుందో పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు రుచి చూపించింది. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ ను పడగొట్టారు. ముగ్గురు కీలక నేతల్ని జైలుకు పంపారు. హోంమంత్రి దేశ్ ముఖ్‌నూ జైలుకు పంపారు. చివరికి శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను కూడా వదల్లేదు. ఆఖరికి ఉద్ధవ్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి సంతృప్తి పొందింది బీజేపీ. ఇప్పుడు వారి పగ తెలంగాణపైకి మళ్లిందని బీఎల్ సంతోష్ వార్నింగ్ తో తేలింది.
Also Read : రేవంత్ లాజిక్ తో కేసీఆర్ పరేషాన్..!
బీఆర్ఎస్ ను శత్రువుగా ఫిక్స్ అయ్యారు బీజేపీ అగ్రనేతలు. పార్టీలో నెంబర్ టూ అయిన బీఎల్ సంతోష్ ను కేసీఆర్ టార్గెట్ చేయడం బీజేపీకి కోపం తెప్పించింది. ఆయన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరగడం బీఎల్ సంతోష్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అయినా , బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగలేదు.
Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల
బీజేపీపై పోరాడేందుకు బీఆర్ఎస్ కు ఉన్న ఒక్కగానొక్క ఆయుధం అత్యుహ్సాహం ప్రదర్శించడంతో సీబీఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే బీజేపీపై అగ్రెసివ్ గా వెళ్ళడం కంటే కాస్త సంయమనం పాటించడమే ఉత్తమమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకంటే , బీఆర్ఎస్ ను ఇరికించేందుకు బీజేపీ వద్ద దండిగా ఆయుధాలు ఉన్నాయి. కాని బీఆర్ఎస్ వద్ద ఏమి లేవు కాబట్టి..బీజేపీ నేతలని రెచ్చగొట్టడం మానేసి సైలెంట్ మోడ్ లో ఉండటం శ్రేయస్కరమని బీఆర్ఎస్ భావిస్తోంది.
Also Read : టి. బీజేపీకి అభ్యర్థులే లేరు.. అధికారంలోకి ఎలా వస్తారు..?