రాబోయే ఐపీఎల్ కోసం ఆటగాళ్ళ వేలం ప్రక్రియ నిర్వహించారు. కాసేపటి కిందట ఈ వేలం ప్రారంభమైంది. ఈసారి రికార్డ్ ధరకు ఆటగాళ్ళను పలు ప్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించే పంజాబ్ కింగ్ యాజమాన్యం ఈసారి వేలంలో దూకుడు ప్రదర్శించింది.
వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 18.50కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్. ఐపీఎల్ లో ఓ ఆటగాడి కోసం ప్రాంచైజీ వెచ్చించిన అత్యధిక ధర ఇదే.
ఇక ఆస్ట్రేలియా టాల్ ప్లేయర్, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడుపోయాడు. అతడిని 17.50కోట్లకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం దక్కించుకుంది. గ్రీన్ కోసం ఢిల్లీ, ముంబై పోటీ పడగా ముంబై అతని కొనుగోలు చేసింది.
ఇక, టీ20 వరల్డ్ కప్ లో తనదైన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 16.25కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. చివరి సారిగా అతను రాజస్తాన్ తరుఫున ఆడాడు. ఈసారి స్టోక్స్ ను ఆ జట్టు రీటైన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు.
ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడగా, చివరికి రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు,అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
సన్ రైజర్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ.2.6 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ.4.2 కోట్లు ), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), ఫజల్లక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ 4 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ. 4.2 కోట్లు), టి నటరాజన్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు)
వదిలేసిన ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్
అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను వేలంలో ఒక్క జట్టు కొనుగోలు చేయలేదు.
బంగ్లాదేశ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది.