వరంగల్ దశ మారనుంది. వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, 3-స్టార్ హోటల్, ఐ టి పార్క్ ల నిర్మాణాలను మడికొండ, వరంగల్, తెలంగాణ (IALA) కింద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP)తో చేయదలచిన పనుల బిడ్స్ తేది ముగిసింది.
వరంగల్ లో మొదలు పెట్టనున్న ఈ పనులకు ఉహించిన దానికంటే ఎక్కువగా బిడ్స్ వచ్చినట్లు ఈ పనుల నిర్మాణం బాధ్యతలు చేపడుతున్న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) మేనేగింజ్ డైరెక్టర్ నరసింహ రెడ్డి తెలిపారు. ఇది కార్యరూపం దాల్చగానే తెలంగాణలో వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యగాలు దొరుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మేనేగింజ్ డైరెక్టర్ నరసింహ రెడ్డి ఈ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) గురించి వివరిస్తూ ఇది పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా మౌలిక సదుపాయాలను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2014 సంవత్సరంలో ఏర్పాటు చేసింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్లాట్లు లేదా షెడ్‌లు, రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధి కేంద్రాలను గుర్తించడం, వాటిని ఇంకా అభివృద్ధి చేయడం కోసం స్థాపించబడింది అని వివరించారు.
పారిశ్రామిక జోన్ల సమీపంలో కార్మికులకు గృహనిర్మాణం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను అందించడం, కమ్యూనికేషన్, రవాణా, ఇతర సౌకర్యాలను అందించడానికి సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేశారు అని చెప్పారు. కార్పొరేషన్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడ్‌లో క్రియాశీల ప్రాజెక్ట్‌లను కూడా కలిగి ఉంది.
కార్పొరేషన్ సిఈఓ వి మధుసూధన్ మరిన్ని వివరాలు అందిస్తూ ”తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. MSE-CDP పథకం కింద భారత ప్రభుత్వ గ్రాంట్‌ను పొందడం ద్వారా క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న క్లస్టర్లు ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక పార్కుల అప్ గ్రేడేషన్ చేస్తునట్లు చెప్పారు. ఈ పనులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి.