మోడీ, అమిత్ షా లు పగబడితే సీన్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. కర్ర విగకుండా పామును చంపడం ఈ ఇద్దరి నేతల స్టైల్. రాజకీయ ప్రత్యర్ధుల్నే లెక్క చేయని ‘మోషా’ల ద్వయం.. వారిని ఇరుకునపెట్టె కథనం విడుదల చేసిన ఓ వార్త సంస్థను క్షమించి వదిలేస్తారా..? ఛాన్సే లేదు. గుజరాత్ లో గోద్రా అల్లర్లకు సంబంధించి బీబీసీ ఓ డాక్యుమెంటరీని ఆన్ లైన్ లో ఇటీవల రిలీజ్ చేసింది. ఈ గోద్రా అల్లర్లలో మోడీకి ప్రమేయం ఉందని ఆ డాక్యుమెంటరీలో ఉండటంతో మోడీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగితే కక్ష సాధింపు చర్యలు అనుకుంటారు. పవర్ లో ఉన్నోడితే పెట్టుకుంటే ఎలా ఉంటుందో చేయాలని కొద్ది రోజులు ఆగి అసలు పిక్చర్ ను చూపిస్తుస్తున్నారన్నట్టు.
గోద్రా అల్లర్ల గురించి ఎక్కడ చర్చ జరగకుండా మోషాల ద్వయం చూసుకుంటుంది. ఈ చర్చను పదేపదే లేవనెత్తిన వాళ్ళను అర్బన్ నక్సలైట్ల ముద్ర వేసి జైల్లో ఖైదు చేసింది. ఇప్పుడు ఆ దుర్ఘటనను బీబీసీ తెరపైకి తీసుకురావడంతో కేంద్ర నాయకత్వానికి మండిపోయింది. ఇంకేముంది ఐటీని రంగంలోకి దింపింది. బీబీసీపైనా ఐటీ దాడులు చేసేశారు. ఈ అంతర్జాతీయ వార్తా సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబైలలలో ఆఫీసులలో…. ఒక్కో చోట అరవై మందికిపైగా ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఆఫీసులోకి వెళ్లిన వెంటనే ఉద్యోగుల దగ్గర సెల్ ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించారు. ఈ అంశం సహజంగానే ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుంది.
గోద్రా అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసిన నాటి నుంచి కేంద్రం ఆ వార్త సంస్థపై పీకల్ దాక ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ఐటీని రంగంలోకి దింపి తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బీబీసీకి తెలిసి వచ్చేలా చేశారని అంటున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియా గొంతు నొక్కుతున్నారన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. తాజాగా బీబీసీపై దాడులతో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకే ఇండియాలో ఇన్ని బెదిరింపులు వేధింపులు ఉన్నప్పుడు ఇక దేశీయంగా ఉండే మీడియా పరిస్థితేమిటో ఊహించుకోవచ్చని కొంత మంది అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.