ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారా..? ఇందుకోసం ముందుగానే అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్నారా..? పొత్తులుండనున్న నేపథ్యంలో కొన్ని స్థానాలు మినహా మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రలుగా భావిస్తోన్న వారినినియోజకవర్గాల్లో పని చేసుకోవాలని చంద్రబాబు సూచించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో ఇప్పటికే 100నియోజకవర్గాలకు అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గెలుపు గుర్రాలుగా భావిస్తోన్న వారికీ మాత్రమే టికెట్లు ఇవ్వాలని భావిస్తోన్న చంద్రబాబు..తమ రాజకీయ వ్యూహకర్త సూచన మేరకు కొంతమందికి టికెట్ పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ పై బాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారని అంటున్నారు.
పోటీగా ఎక్కువగానున్న నియోజకవర్గాలను వదిలేసి.. గెలుస్తారని బాబుకు నమ్మకం ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 100 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో జనసేన-టీడీపీ-కమ్యనిస్టులు కలిసి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకు వారికి కేటాయించే అవకాశం ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లోనూ పెండింగ్ పెట్టారని తెలిసింది.
ఇప్పటి వరకు ఖరారు అయిన స్థానాలు ఇవే
విజయవాడ తూర్పు సెంట్రల్ జగ్గయ్యపేట మైలవరం మచిలీపట్నం పెనమలూరు నందిగామ గతంలో పోటీ చేసి ఓడిన వారికే ఇవ్వనున్నారు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, కైకలూరు వంటివి పెండింగ్ లో ఉన్నాయి. లేదా జనసేనకు కేటాయిస్తారు.
బీజేపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు పశ్చిమ నుంచి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పెదకూరపాడు వినుకొండ గురజాల రేపల్లెలో పాతవారే పోటీ చేయనున్నారు. నరసారావు పేట సత్తెనపల్లి తెనాలి నియోజకవర్గాలను పరిశీలనలో ఉంచారు.
ఉత్తరాంధ్రలోనూ పాతవారే పోటీలో ఉండనున్నారు అయితే.. విశాఖ ఉత్తరం దక్షిణ నియోజకవర్గాలు భీమిలి బొబ్బిలి విజయనగరం వంటి వాటిని కూడా పరిశీలనలో ఉంచారు. శ్రీకాకుళం నియోజకవర్గం కూడా పెండింగులో ఉన్నా ఇక్కడ జనసేన – టీడీపీ మధ్య ఎవరికీ ఇవ్వాలని దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.
రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో నంద్యాల పెండింగులో ఉంది. కర్నూలు టీజీ భరత్ కు కేటాయించారు. పాణ్యం కూడా కేటాయించారు. ఆళ్లగడ్డ పెండింగులో ఉన్నాభూమా అఖిలప్రియకే కేటాయించే ఛాన్స్ ఉంది. శ్రీశైలం ఏవీ సుబ్బారెడ్డికి కేటాయించే అవకాశం ఉంది.
కడపలో మాత్రం సరైన అభ్యర్థులు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఉన్నవారిలో మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ కు, కడపను ఆదినారాయణరెడ్డి(ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఎన్నికల నాటికీ టీడీపీలో చేరే అవకాశం ఉంది) పులివెందుల విషయంలో చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Also Read : జనసేన టీడీపీ పొత్తు -ఆ 55సీట్లను కోరుతోన్న పవన్ కళ్యాణ్..!