భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అందుకే ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడి కట్టు, బొట్టును విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతుంటారు. పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోకి వచ్చింది కానీ, మరీ విదేశీ మహిళల తరహాలో భారతీయ స్త్రీలు అరకొర దుస్తులను ధరించి బయటకు రారు. కానీ ఇండియాలోని ఓ గ్రామంలో మాత్రం మహిళలు ఐదు రోజులపాటు దుస్తులు వేసుకోకుండానే తిరుగుతారు.
హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలోని పిని గ్రామం. అక్కడి గ్రామ మహిళలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజులపాటు దుస్తులు ధరించకుండా నగ్నంగానే ఉంటారు. పూర్తి నగ్నంగా కాకుండా పలుచటి వస్త్రాల్ని మాత్రమే ధరిస్తారు. ఈ ఐదు రోజులు భార్యాభర్తలు అస్సలు మాట్లాడుకోరు. దూరంగా ఉంటారు. మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా ఐదు రోజులు కఠిన నిబంధనలు ఉంటాయి. మద్యం తాగకూడదు. మాంసం తినకూడదు. ఈ నియమాలు పాటించకపోతే దేవుళ్ళకు కోపం వచ్చి కీడు జరుగుతుందని ఆ గ్రామ వాసుల నమ్మకం. శతాబ్దాల నాటి ఆచారాన్ని పిని గ్రామ వాసులు ఇప్పటికీ పాటిస్తున్నారు.
అసలు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..ఒకప్పుడు పినీ గ్రామంలో రాక్షసులు తిరిగేవట. గ్రామంలో మహిళల దుస్తులను చింపి తీసుకెళ్ళేవట. ఆ రాక్షసుల్ని నుంచి “లహువా ఘోండ్” అనే దేవత ప్రత్యేక్షమై మహిళలను రక్షించిందట. భాద్రపద మాసం తొలిరోజు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతుంటారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజులపాటు శ్రీలు దుస్తులు ధరించకుండా ఉండే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఐదు రోజుల్లో గ్రామంలోకి బయటి వ్యక్తుల్ని కూడా రానివ్వరు.
Also Read : భార్యలను అద్దెకిచ్చే ఆచారం – ఇండియాలో ఎక్కడో తెలుసా?