బాలికలు, మహిళలు అత్యాచారానికి గురయితే ముందు వాళ్ళకు రూ. 10,000 ఇచ్చి ఆర్టికంగా ఆడుకునే పథకం అమలు చేసున్నట్లు ‘షీ టీమ్స్’, ‘భరోసా’ విభాగం ఏసిపి డి. లక్ష్మీ ప్రసన్న చెప్పారు. అత్యాచారాని గురయ్యిన మహిళలలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల న్యాయపోరాటం చేయలేక వేనుకడుగు వేస్తున్నారు. అందువల్ల కొన్ని కేసులు మధ్యలోనే ఆగిపోతున్నాయి అని ఆమె బాధపడ్డారు. అందుకే రేపిస్తులు శిక్ష నుంచి తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కూలి – నాలి చేసుకునే పేద మహిళలకు, బాలికలకు ‘భరోసా’ (హైదరాబాద్ సిటి పోలీస్) అండగా ఉంటుంది. కేసు మొదలయ్యినప్పటినుంచి కోర్ట్ లో తుది తీర్పు వచ్చేవరకు ‘భరోసా’ విభాగం లాయర్ ఖర్చులు, మెడికల్ ఖర్చులు, ఇతర అన్ని కర్చులు భరిస్తుంది. కేసు తీవ్రతను బట్టిప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి రూ. 10,000 చొప్పున ఆ మహిళకు లేదా బాలికకు ఇచ్చి ఆదుకుంటుంది అని డి. లక్ష్మీ ప్రసన్న చెప్పారు. అందుకే దీనికి ‘భరోసా’ అనే పేరు పెట్టారు.
లోగడ మహిళల మీద జరిగిన పలు అత్యాచార కేసులను సమర్థవంతంగా పరిశోధించిన డి. లక్ష్మీ ప్రసన్న ఎందరో రేపిస్ట్ లను పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. అందుకే ఆమెకు పోలీసు డిపార్ట్మెంట్లో ‘ఐరన్ లేడిగా’ అనే మంచి పేరుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆమెను కావాలని ‘షీ టీమ్స్’, ‘భరోసా’ విభాగం ఏసిపి గా నియమించింది.
అందుకు అనుగుణంగానే ఆమె చార్జ్ తీసుకున్న కేవలం వారం రోజులలోనే తన తడాకా చూపిస్తూ రోమియోలను, ఆకతాయిల భరతం పడుతున్నారు. నేరస్తులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. హైదరాబాద్ ని ఆమె ఐదు డివిజన్ లుగా విభవించారు. ప్రతి డివిజన్ లో రెండు ‘షీ టీం’ లు మఫ్టీ లో 24 గంటలు తిరుగుతారు. ఎక్కడ రోమియోలు కనిపించినా, వైన్ షాప్ల ముండు తాగుబోతులు ఆడవాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించినా, రోడ్ల మీద తాగి ఆడవాళ్ళను టీజ్ చేసినా, కాలేజీల ముందు ఆకతాయిమూకలు అల్లరి చేసినా అంతే సంగతులు. వాళ్ళ ఆధర్ కార్డ్ లు, సెల్ ఫోన్లు తీసుకుని కేసు నమోదు చేసి చుక్కలు చూపుతున్నారు.
వాళ్ళమీద డేగా కన్ను వేసి మహిళకు ఎలాంటి హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అత్యాచార జరిగాకా మహిళను ఆదుకోవడం పోలీసుల గొప్ప కాదు, అసలు అత్యాచారం జరగకుండా చూడడమే పోలీ సుల కర్తవ్యం అని ఆమె నమ్మిన సిద్ధాంతం.
‘షీ టీమ్స్’ కు, ‘భరోసా’ కు తేడా ఏమిటి?
ఈ రెండు విభాగాలు మహిళలకు రక్షణ కల్పించేందుకు ఏర్పడిన స్పెషల్ బ్రాంచ్ లు. అయితే వీటి పనితనంలో తేడాలు ఉన్నాయి. ‘షీ టీమ్స్’ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ముందు జాగ్రత్త పడుతోంది. నగరాన్ని జల్లెడ పడుతూ 24 గంటలు పెట్రోలింగ్ చేస్తారు. 100 నెంబర్ నుంచి, వాట్స్ ఆప్, ఈమెయిల్ నుంచి వచ్చే కేసుల ఆధారంగా ఎప్పటికప్పుడు రోమియోల వెంటపడి అరెస్ట్ చేస్తారు. వాళ్ళకు ముందు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు.
ఇవి చాలావరకు పిటి కేసులు. నేరస్తులు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళ వివరాలు సేకరించి హెచ్చరించి వదిలేస్తారు. ఈ ‘షీ టీం’ దేశం లోనే గొప్ప ప్రయోగం. ఇది విజయవంతం కావడంవల్ల పలు రాష్ట్రాలు దీనిని కాపి కొడుతున్నాయి. దీనివలన దాదాపు 80 శాతం రేపులు తగ్గాయి అని ఆమె చెప్పారు.
కాలేజీలు, మహిళా సంఘాల దగ్గరికి వెళ్లి మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తూన్నారు. ఎవ్వరు వెంటపడినా, అల్లరి చేసినా, ఫోన్ చేసి బ్లాకు మెయిల్ చేసినా 100 నెంబర్ కి ఒక్క కాల్ చేస్తే చాలని మహిళలకు ఓ దారి చూపిస్తున్నారు డి. లక్ష్మీ ప్రసన్న.
ఇక ‘భరోసా’ టీం నేరాలు జరిగాకా మహిళలకు అండగా నిలబడి ఆర్థిక సహాయం చేస్తూ, న్యాయసేవలు అందిస్తారు. కోర్ట్ లో తుది తీర్పు వచ్చేవరకు వాళ్ళకు అండగా ఉంటారు. వాళ్ళకు తగిన న్యాయం జరిగేలా చూస్తారు. దాదాపు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఇప్పటివరకు 5 మందికి ఇలా సహాయం చేసినట్లు డి. లక్ష్మీ ప్రసన్నచెప్పారు.
అడిషినల్ సి పి శ్రీనివాస్ పాత్ర ఎంత?
అడిషినల్ సి పి గా చార్జ్ తీసుకున్న ఏ ఆర్ శ్రీనివాస్ (క్రైమ్, సిట్) సారధ్యంలో నరంలో మహిళల మీద జరిగే అత్యాచారాలా శాతం గణనీయంగా తగ్గిందని గణాంకాలు చెపుతున్నాయి. 2021తో పోల్చితే 2022లో మహిళల మీద జరిగే అత్యాచారాలు చాలా తక్కువా. 2021లో మహిళల మీద జరిగిన అన్ని రకాల కేసులు 1153. అయితే 2022లో మహిళల మీద జరిగిన అన్ని రకాల కేసులు కేవలం 513 మాత్రమే. ఇందుల్లో 138 కేసులు రెడ్ హైన్దేడ్ గా పట్టు కున్నవి. 132 పిటి కేసులు, 14 ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపినవి, 55 కేసులు వార్నింగ్ లు ఇచ్చి పంపినవి, 174 ఫాలో ఆన్ లో ఉన్నాయి.
ఈ నేరాల శాతం ఇలా తగ్గడానికి ఆయన చూపిన చొరవ, ప్రోస్త్సాహం కారణం అని డి. లక్ష్మీ ప్రసన్న ప్రశంసలు కురిపించారు. సామాన్యంగా సగటున పది రేపులు జరుగుతాయి. ఆమె చెప్పిన వివరాల ప్రకరం, ఇలాంటి కఠిన చర్యలవల్ల 8 కేసులు ఆపుతున్నారు. ఒకటి, రెండు కేసులు మాత్రమే జరుగు తున్నాయి అన్నారు. అయితే వాటిని కూడా ఆపి ‘జీరో’ శాతం వరకు వచ్చేలా చూస్తామని చెప్పారు.