మనకు తెలియని విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. గూగుల్ ఉండగా చింత ఎందుకు దండగ అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. అయితే, గూగుల్ లో దేనైనా సెర్చ్ చేయవచ్చు కాని కొన్నింటిని సెర్చ్ చేస్తే క్రిమినల్ యాక్ట్ వర్తిస్తుంది.
గూగుల్ లో అన్ని విషయాలను సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కాని బాంబును ఎలా తయారు చేయాలో వెతికితే సైబర్ క్రైం నిఘాలో పడి అరెస్ట్ అయ్యే అవకాశం వందశాతం ఉంటుంది.
బాంబు సమాచారాన్ని సేకరించడం శిక్షార్హమైన నేరం. అదే విధంగా 18ఏళ్లలోపు పిల్లల అశ్లీల చిత్రాల కోసం వెతికితే పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారు.
ఇంటర్నెట్‌లో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం అంటే అబార్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడం, కాపీరైట్ ఉన్న చిత్రాలను వెతకడం కూడా శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. అందుకే గూగుల్ లో ఈ తరహ వాటిని సెర్చ్ చేయకండి.